Breaking News

సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా లెనిన్ సెంటర్, జింఖానా గ్రౌండ్స్ స్విమ్మింగ్ పూల్, మీసాల రాజారావు వంతెన, యం.జీ రోడ్, పటమట చెన్నుపాటి రామకోటేశ్వరరావు ఇన్ డోర్ స్టేడియం లను సందర్శించారు, లెనిన్ సెంటర్ పార్క్ నందు మరియు వెలుపల ఉన్న అనధికార ఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అదే విధంగా గాంధీనగర్ నందలి సర్ విజ్జి స్విమ్మింగ్ ఆధునీకరణ పనులకు సంబందించి పూల్ నందు క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలకు సంబందించిన ఆధునీకరణ పనుల వివరాలు అధికారులను అడిగితెలుసుకొని వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. స్విమ్మింగ్ పూల్ నందు చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ పనులతో పాటుగా పూల్ నందు గ్రీనరి పనులను చేపట్టి ఆహ్లాదకరంగా పచ్చదనంతో అభివృద్ధి పరచాలని ఉద్యాన వనశాఖాదికారులను ఆదేశించారు. తదుపరి మీసాల రాజారావు వంతెన జి.ఎస్ రాజు రోడ్ ఇరువైపుల సుందరంగా తీర్చిదిద్దాలని మరియు యం.జీ రోడ్ సెంట్రల్ డివైడర్ నందలి పాడైన బోగన్ విల్లా మొక్కల స్థానములో కొత్త మొక్కలను ఏర్పాటు చేసి, ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేసి డివైడర్ లను ఆకర్షనియంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటమట పంటకాలువ రోడ్ నందు పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పర్యవేక్షించి శానిటరీ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో వ్యర్ధములను తొలగించి మురుగునీటి పారుదల సక్రమముగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *