మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన డీఎంహెచ్ఓ గా డాక్టర్. జి.గీతాబాయి గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు ఆమె విజయవాడ మునిసిపాలిటీ కార్పొరేషన్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి పదోన్నతిపై మచిలీపట్నంకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను మర్యాద పూర్వకంగా కలిసి గౌరవ సూచకంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఇక్కడ ఇంత వరకు పనిచేసిన డాక్టర్ సుహాసిని దేవి ఎన్టీఆర్ జిల్లాకు డిఎంహెచ్ఓ గా బదిలీ అయ్యారు. డాక్టర్ జి.గీతాబాయి గతంలో గుంటూరు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ గా నాలుగేళ్లు పనిచేశారు.
Prajavartha Online Telugu News