Breaking News

మోడల్‌ విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు గ్రామాలను మోడల్‌ విలేజ్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ కమీషనర్‌ కోన శశిధర్‌కు వివరించారు. స్వచ్ఛ సంకల్పం, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పనులు కల్పన తదితర అంశాలపై అమరావతి నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో గురువారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ కమీషనర్‌ కోన శశిధర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో తాను క్షేత్రస్థాయిలో రెండు గ్రామాలలో జరుగుతున్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు గమనించానన్నారు. వీటిలో సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మోంట్‌లో ఉండే ఫుడ్‌వేస్ట్‌, కూరగాయలవేస్ట్‌ను స్థానికులు ఇంటి వెనుక ఉంటున్న ఖాళీ స్థలాలలో వేస్తున్నట్లు గుర్తించమన్నారు. క్లాప్‌ మిత్రాలు అందించిన తడి, పొడి చెత్త వేరు చేసే చెత్తబుట్టలో వేయకుండా డ్రైనేజ్‌లో వేయడం వలన డ్రైనేజ్‌లలో మురుగునీరు పారేందుకు వీలుకాకుండా ఉంటున్నాయన్నారు. దీనిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. వాలంటీర్లు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వాటాదారులుగా ఏర్పడి నూరు శాతం చేత్తను సేకరించే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో లక్ష మందికి పైగా కూలీలకు ఉపాధి హామీలో పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌, జడ్పిసిఇఓ సూర్యప్రకాష్‌, డిపివో కె. పూర్ణ చంద్రశేఖర్‌, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *