Breaking News

జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాం… మౌలిక వసతుల పై మరింత చర్యలు తీసుకుంటున్నాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నామని, మౌలిక వసతుల పై మరింత చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి యంటి కృష్ణబాబు, కమీషనర్‌ జె.నివాస్‌కు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి యంటి కృష్ణబాబు, కమీషనర్‌ జె.నివాస్‌ గురువారం సచివాలయం నుండి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నుండి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. తదనుగుణంగా జిల్లాలో ఆసుత్రులలో మెరుగైన పరిస్థితి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అసుపత్రులలో అంబులెన్స్‌ నిర్వహణ, అవసరమైన అత్యవసర మందులు, శానిటేషన్‌ మౌలిక సదుపాయాలు, శానిటేషన్‌ సిబ్బంది, పెస్ట కంట్రోల్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఫైర్‌ ఆడిట్‌ ఆసుపత్రులు నిర్వహణ, పెక్యూరిటీ అంశాలకు అత్యంత ప్రాధాన్యతని ఇచ్చి నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సిఉందన్నారు. రోగులకు అంబులెన్స్‌ సౌకర్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో పెషెంట్‌ ట్రాన్స్‌పోర్టు అంబులెన్స్‌ (పిటిఏ), బెసిక్‌ లైవ్‌ సపోర్టు అంబులెన్స్‌ (బిఎల్‌ఎస్‌), అడ్వాన్స్‌ లైవ్‌ సపోర్టు అంబులెన్స్‌ (ఏఎల్‌ఎస్‌) వాహనాలను నిర్వహించేందుకు శనివారం ప్రైవేట్‌ అంబులెన్స్‌ వాహనదారులతో ధరలను నిర్థారించేందుకు సమావేశాన్ని నిర్వహించి ఆయా అంబులెన్స్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహా ప్రస్థానం 5 అంబులెన్స్‌లు ఉన్నాయని వాటిలో ఒక అంబులెన్స్‌ను ప్రత్యేకంగా రాత్రి సమయంలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జిజిహెచ్‌లో ప్రస్తుతం ఉన్న 64 సిసికెమెరాలకు అదనంగా మరో 20 సిసికెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కాజువాలిటి బెడ్ల సంఖ్యను 20 నుండి 40కి పెంచామన్నారు. మథర్‌ న్యూ బేర్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎంఎన్‌సియు), స్పెషల్‌ న్యూ బేర్న్‌కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సియు)లకు సపోర్టు అందించి మాతా శిశు మరణాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణ బాబు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనందు ఖాళీలు భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. కోవిడ్‌ మరణాలకు సంబంధించిన నగదు (ఎక్గ్స్రేషియా) త్వరితగతిన చెల్లించడం జరుగుతుందని అందుకు సమగ్ర నివేదికలు సిద్దం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆసుపత్రుల తనిఖీల్లో వాహనాలు నిర్వహణ, మహాప్రస్థానం, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, మృతదేహాల తరలింపు, పోస్టు మార్టంకు సంబంధించి డ్రైవర్స్‌, డాక్టర్స్‌, సిబ్బంది, బాధిత కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగిందన్నారు. వివిధ విభాగాల అధికారులు శానిటేషన్‌ సిబ్బంది, ఇతర సిబ్బందితో విడివిడిగా సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *