Breaking News

నవరత్నాలతో పేదల జీవితాల్లో సంక్షేమ కాంతులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు..
-23 వ వార్డు 97వ సచివాలయ పరిధిలో సందడిగా సాగిన గడప గడపకు మన ప్రభుత్వం
-ఇంటింటికీ వెళ్లి అన్ని వర్గాల ప్రజల సలహాలు, సూచనలు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన నవరత్నాలు పేద ప్రజల జీవితాలలో సంక్షేమ కాంతులు నింపుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ – 97 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం కోలాహలంగా సాగింది. తొలుత వినాయకుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం చిలుకుదుర్గయ్య వీధి నుంచి పర్యటన ప్రారంభించారు. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరించారు. గోపురాజు రామచంద్రారావు వీధి, గోవిందరాజుల నాయుడు వీధి, విష్ణువర్దన్ వారి వీధి, కాళేశ్వరరావు వీధి, భవానీ వీధి వరకు సాగిన పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వార్డు సచివాలయ పరిధిలోని 895 గృహాలలో, తొలి రోజు 520 గడపలను సందర్శించి లబ్ధిదారులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ప్రతి ఒక్క గడపకు అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా లబ్ధిదారులకు వివరించారు. పింఛన్లు సకాలంలో అందుతున్నదీ లేనిది వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, లాయర్లు, అధికారులు, వ్యాపారస్తులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. వీటన్నింటిపై యాక్టన్ టేకెన్ రిపోర్టును సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. మెరుగైన పాలనకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై పలు ఫిర్యాదులు అందడంతో.. సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. మురుగు బయటకు పొంగకుండా.. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆశావర్కర్లు, హెల్త్ సెక్రటరీలకు సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ప్రజల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాన్ని ఇంటి గడప వద్దకే తీసుకువెళ్లడం జరుగుతోందన్నారు. గత తెలుగుదేశం హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన డివిజన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలకు గానూ దాదాపు రూ. కోటి నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. విష్ణువర్దన్ రావు వీధి, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, గోపరాజు రామచంద్రరావు వీధి, నరసింహనాయుడు వీధులలో నూతన రహదారులకు రూ. 75 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సూర్యారావుపేటలో సిమెంట్ రోడ్ల ప్యాచ్ పనులకు రూ. 11 లక్షలతో పాటు.. తారురోడ్డు ప్యాచ్ పనులకు రూ. 9 లక్షల నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంట్రోల్ రూం నుంచి పుష్ప హోటల్ సెంటర్ వరకు రూ. 8 కోట్ల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణాలను త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామని తెలియజేశారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలన్నింటినీ గాడిన పెట్టే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. నాడు-నేడు కార్యక్రమంపై తెలుగుదేశం నాయకులు పచ్చ మీడియా సాయంతో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అధికార దాహంతో ప్రతిపక్షాలు చవకబారు విమర్శలు చేస్తున్నా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బాధ్యతతో పేదల గూర్చి ఆలోచన చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం.. ఇలా ప్రతీ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథంలో నిలుపుతున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్ పెక్టర్ బాలాజీ, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు వెన్నం రత్నారావు, శేషన్ మురళి, దమ్మాల మల్లి, ఆత్మకూరి అప్పారావు, నిఖిల్ సూద్, రామ్ పిఎస్ఆర్, కె.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *