Breaking News

మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర మేయర్ తో కలిసి రూ. 80 లక్షల విలువైన యూజీడీ పైపు లైన్ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2019 కి ముందు విజ‌య‌వాడ న‌గ‌రానికి.. ప్రస్తుత న‌గ‌రానికి అభివృద్ధిలో ఎంతో వ్యత్యాసం ఉంద‌ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మ‌ల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ రామకృష్ణాపురంలో నూతన యూజీడీ పైపు లైన్ ఏర్పాటుకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డిలతో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోతూపోతూ నగరంలో పెద్దఎత్తున సమస్యలను వదిలివెళ్లిందని మల్లాది విష్ణు విమర్శించారు. వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా అయోధ్యనగర్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ నుంచి దేవీ నగర్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ వరకు నూతన డ్రైనేజీ పైపు లైన్ ఏర్పాటుకు రూ. 80 లక్షల వ్యయంతో నేడు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. పనులు నెల రోజుల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. యూజీడీ పైపు లైన్ పనుల అనంతరం రామకృష్ణాపురం నుంచి ఉలవచారు కంపెనీ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు కలుపుతూ ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రస్తుతం డివిజన్ లో రూ. 10 లక్షల వ్యయంతో ప్యాచ్ వర్కులు జరుగుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా దేవీన‌గ‌ర్ నుంచి ఉల‌వ‌చారు కంపెనీ వ‌ర‌కు ర‌హ‌దారి నిర్మాణానికి టెండ‌ర్లు ప్రక్రియ పూర్తి అయిందని పేర్కొన్నారు. రోడ్డు విస్తర‌ణ‌లో ఇళ్లు కోల్పోయే వారికి టీడీఆర్ బాండ్లను త్వరిత‌గ‌తిన అంద‌జేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సభ్యుల ప్రవర్తించిన తీరు జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మాదిరిగానే ఆ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇకపై కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి వివాదాలకు తావులేకుండా అర్థవంతంగా సభ జరిగేలా చూస్తామని తెలియజేశారు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. సమస్యలు తన దృష్టికి వచ్చిన వెనువెంటనే పరిష్కారానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు చూపిస్తున్న చొరవ హర్షణీయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా రాబోవు రోజుల్లో ఇటువంటి మరెన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *