Breaking News

ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరానికి లక్ష విరాళం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరం లో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి తమ వంతు సహాయంగా కె హరికృష్ణ  50,000-00 రూపాయలు అదే విధముగా వెండి తాపడం పనులకు 50,000-00  వెండిని  (మొత్తం వెరశి 1,00,000=00) విరాళముగా మందిర గౌరవాధ్యక్షులు  పి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. దాత మాట్లాడుతూ మందిరంలో నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు చూసి ఎంతో ఆనందం కలిగింది, అందుచేతనే మందిరం వారు నిర్వహించిన ఏ కార్యక్రమానికైనా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.  అందులో భాగంగా అత్యంత అద్భుతంగా షిరిడీ లో ఉన్న మాదిరిగానే మందిరంలో వెండి తాపడం పనులకు మరియు నిత్యాన్నదానమునకు నా వంతుగా సహాయాన్ని అందజేశామని తెలిపారు. మందిర గౌరవాధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి  మాట్లాడుతూ మందిరంలో ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తుల సహాయ సహకారాలు మరువలేనివి వారికి ఎన్నడూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము అని తెలిపినారు. ఈ మందిరం లో ఉండే విశేష శక్తి వల్ల బాబా వారిని భక్తులు ప్రతిరోజూ దర్శనం చేసుకొని వారు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏ కార్యక్రమానికైనా భక్తులు విరివిగా వారి యొక్క సహాయ సహకారాలు అందజేయడం వల్ల ఎటువంటి పెద్ద కార్యక్రమమైన కూడా మాకు శ్రమ లేకుండానే బాబా వారి అనుగ్రహముతో  దిగ్విజయంగా పూర్తి అగుచున్నది అని మందిర గౌరవాధ్యక్షులు తెలియజేశారు.  కావున భక్తులందరూ కూడా మీ శక్తి కొలది కొత్త వెండి లేదా మీ ఇంట్లో వాడే పాత వెండి వస్తువులు అయినా సరే సమర్పించి శాశ్వతంగా ఉండేటటువంటి  రజక తాపడం లో మీరు కూడా భాగస్వాములు కావలసినదిగా మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మందిర గౌరవాధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి మరియు మందిర సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *