విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య సముదాయాలలోని దీర్ఘకాలికంగా ఉన్న షాపు లీజుదారుల అద్దె బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలనే నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, వారి ఆదేశాల మేరకు మంగళవారం ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లుతో కలసి సీతన్నపేట దుమ్మలపాటి రామారావు కూరగాయల మార్కెట్ సముదాయంలో ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నందు రూ. 1,00,000/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికంగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని 10 షాపులను రెవిన్యూ అధికారులు సిజ్ చేయడమైనది.
Prajavartha Online Telugu News