Breaking News

సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను అభినందించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ సర్వీసెస్ పరీక్షలో 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. జాతీయ స్ధాయిలో 685 మంది అభ్యర్ధులు ర్యాంకులు సాధించగా, దాదాపు పది మంది తెలుగు రాష్ట్రాల నుండి ఉండటం శుభ పరిణామమన్నారు. ర్యాంకులు సాధించిన పి సాహిత్య (24వ ర్యాంక్), శృతి రాజ్యలక్ష్మి (25వ ర్యాంక్), రవికుమార్ (38)లతో పాటు కె కిరణ్మయి, పాణిగ్రాహి కార్తీక్, జి సుధీర్ కుమార్ రెడ్డి, శైలజ, శివానందం, ఎ నరేష్‌లను గవర్నర్ హరిచందన్ అభినందించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *