Breaking News

“కుల,మత,రాజకీయాల అతీతంగా సంక్షేమం దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం” : దేవినేని అవినాష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ 201వ సచివాలయ పరిదిలోని లారు వారి స్ట్రీట్ మరియు యాదవుల బజార్ ప్రాంతాలలో ఇంటి ఇంటికి పర్వతనేని పవన్ (బాబీ) తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలు ను సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.రాబోయే రోజులలో నూటికి నూరుశాతం ప్రజలకు, అర్హులయినవారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది అని అన్నారు. పూర్తిగా పారదర్శకత, పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే విధముగా పని చేయాలని వాలంటీర్లకు, సచివాలయం సిబ్బందినకి సూచించినట్టు తెలిపారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ కులాలు, మతాలు,రాజకీయాలు ఆతీతంగా సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పారు.గడప గడపకు తిరుగుతుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం చాలా అందనంగా ఉంది అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో జన్మభూమి కమిటీలు అని అబద్దపు మాటలు చెప్పి వాళ్ళకి సంబదించిన మనుషులకు మాత్రమే పథకాలు ఇచ్చేవారు అని, మా వైసీపీ ప్రభుత్వం ఆలా కాదు అని మాట ఇస్తే కట్టుబడి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని,జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు,ఇండ్ల స్థలాలు ప్రజల గడప వద్దకు వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని అన్నారు.2024 లో తూర్పు నియోజకవర్గం లో వైస్సార్సీపీ జెండా ఎగేరేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ,వైస్సార్సీపీ నాయకులు సందీప్ రెడ్డి,చక్రవర్తి,పటమట దుర్గా ప్రసాద్,కోలా లవ,లక్ష్మి,ఇందిర తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *