Breaking News

ఈనెల 27న సెంట్రల్ నియోజకవర్గ ప్లీనరీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 27న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 27న సాయంత్రం 5 గంటలకు గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలెస్ నందు నియోజకవర్గ ప్లీనరీ జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రధానంగా గత మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రజలకు అందజేసిన నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలుపై వివరించి.. డివిజన్ స్థాయిలో ఇంటింటికి వివరించాలనే లక్ష్యంతో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పార్టీ విధి విధానాలు, నిర్మాణాత్మక విషయాలపై సమగ్రంగా చర్చలు జరుగుతాయన్నారు. కావున వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొనవలసిందిగా మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేసి ప్లీనరీని జయప్రదం చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *