Breaking News

భూముల రీ సర్వే ను వేగవంతం చేసి నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలని సీసీఎల్ఏ కార్యదర్శి అహ్మద్ బాబు అన్నారు. గురువారం అమరావతి నుండి అహ్మద్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ సురక్షలో భాగంగా జరుగుతున్న భూముల రీ సర్వే పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు సూర్యారావు పాల్గొన్నారు. భూరికార్డుల స్వచ్ఛీకరణ, శాశ్వత భూ హక్కుభూ రక్షా, రీ సర్వే పనుల నిర్వహణ తదితర అంశాలపై రీసర్వే ప్రక్రియను బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అహ్మద్ బాబు మాట్లాడుతూ డూప్లికేషన్ కు తావు లేకుండా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ నిర్వహించాలని, భావితరాలకు వివాద రహిత భూములను అందించేందుకు సర్వే ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సర్వే పూర్తి అయిన పిదప స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సచివాలయంలో అందుబాటులోకి వస్తాయన్నారు. స్థిరాస్తుల సర్వే యజమానులకు ధ్రువీకరణ పత్రాలు ప్రతి ఒక్కరికి ఐడెంటిఫికేషన్ నెంబర్ తో హక్కు పత్రాలు జారీ చేస్తారన్నారు భూరికార్డుల ప్రక్షాళన పనులు శరవేగంగా చేపట్టి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. వివాదాలు లేని ఎవరు సవాల్ చేయలేని ఆస్తి హక్కును రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోందన్నారు ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో యజమానులను భాగస్వామ్యం చేస్తూ పారదర్శకంగా చేపట్టాలన్నారు. గ్రామాల వారిగా స్వచ్ఛ్ కరించిన రికార్డులను రిజిస్ట్రేషన్ ల కొరకు సబ్ రిజిస్టార్ లు, రెవెన్యూ అధికారులు గ్రామ సచివాలయానికి అందించాలన్నారు.తదుపరి రిజిస్ట్రేషన్ సేవలు. డ్రోన్ ఫ్లైయింగ్,జిపిఎస్ ప్రక్రియలను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *