విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్ దేశంలో, పురుగుమందుల తయారీ లో అగ్రగామి సంస్థ పి ఐ ఇండస్ట్రీస్, ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో రెండు నూతన ఉత్పాదనలైన బ్రోఫెయా మరియు డైనోఏస్ విడుదల చేసారు. గతంలో రాకెట్, కరీనా, బయోవటా, నామినీ గోల్డ్, ఒషీన్, కీఫన్ & వైబ్రెంట్ వంటి ఎన్నో విశిష్ట ఉత్పాదనలను అందిస్తూ రైతుల అదరణ పొందిన కంపెనీ పి ఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
బ్రోఫెయా లో ఉన్న క్యూపి టెక్నాలజీ మిరప మరియు కూరగాయల పంటలలో వచ్చు పచ్చ పురుగు మరియు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగుల పై అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే డైనోఏస్లో ఉన్న డి ఎస్ ఏ టెక్నాలజీ ప్రత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులైన పచ్చ దోమ నియంత్రణలో రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ దుష్యంత్ సూద్, కమర్షియల్ లీడ్ గౌరవ్ కాట్యాల్, క్లస్టర్ హెడ్ ఏం.ఎస్. నాయుడు, జోనల్ మేనేజర్ తరుణ , క్రాప్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
డైనోఏస్ & బ్రోఫెయా-లో ఉన్న నూతన టెక్నాలజీ, భారత్ దేశపు రైతులకు ఒక వరం గా మారుతుంది అని దుష్యంత్ సూద్ చెప్పారు. అలాగే పి ఐ కంపెనీ సిబ్బంది ఈ క్రొత్త టెక్నాలజీ ని రైతుల దాకా చేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు అని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కొత్త -నూతన టెక్నాలజీ ఉత్పత్తులు పి ఐ ఇండస్ట్రీస్ తీసుకుని వస్తోందని మరియు ఈ క్రొత్త ఉత్పత్తులు రైతులకు వ్యవసాయంలో ఎంతో మేలు చేస్తాయని, ఏం.ఎస్. నాయుడు డిస్ట్రిబ్యూటర్ల కి వివరించారు. ఈ సమావేశంలో , పి ఐ కంపెనీ కి వస్తున్న క్రొత్త ఉత్పాదనలు అయిన సెక్టిన్, డిఫెంసా, ప్రొవైడ్ మరియు అవకీరా ని కూడా విడుదల చేసారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ టి. రవీంద్రా, రీజనల్ మేనేజర్ శివ రామ రెడ్డి, రఘుపతి రెడ్డి శ్రీకాంత్, అనిల్, కిషోర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News