తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రాధన్యత ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముఖ్య అధికారులతో ఎమ్మెల్యే భూమన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ గడప గడపలో ప్రజల నుండి వచ్చే ప్రతి ఓక్క సమస్యని పరిష్కరించాలన్నారు. తమ భర్త డెత్ సర్టిఫికెట్లు లేకపోవడంతో వితంతు ఫింక్షన్లు రావడం లేదని చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్థావిస్తూ లేటు డెత్ సర్టిఫికెట్ల మంజూరుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా చాలా సంవత్సరాలు పాటు వెల్లిపోయిన తమ భర్తలు బతికి వుండే అవకాశాలు లేవని, తమకు వితంతు ఫింక్షన్లు కావాలనే డిమాండుపై అధికారులు ఓక నిర్ణయానికి వచ్చి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొన్ని చోట్ల దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, మరికొన్ని చోట్ల కాలువలు నిరంతరం శుభ్రపరిచేలా చూడాలనే పిర్యాదులపై అధికారులు స్పందించాలన్నారు. ఇకపై ప్రజల నుండి వ్రాత పూర్వకంగా, మౌఖికంగ అందే పిర్యాధులను నమోదు చేయాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు కావల్సిన ప్రదేశాలను గుర్తించి కౌన్సిల్ సమావేశాలకు తీసుకురావలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, ఎస్.ఈ తిరుమాలిక మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, రెవెన్యూ ఆఫిసర్ సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News