Breaking News

సమైక్య కృష్ణాజిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నిర్వాహకులు, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ముమ్మనేని గోపాలకృష్ణ మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్య లు తీర్చి వారి సంక్షేమానికి కృషి చేయాలని, రాష్ట్రంలో మాజీసైనికులకు తీరని ద్రోహం జరుగుతోందన్నారు. మాజీ సైనికుడు అంటే చిన్నవయసులో నూనూగు మీసాలురాగానే సైన్యంలో చేరి తల్లి తండ్రులను అక్కాచెల్లి తనవారిని వదిలి దేశం కోసం దేశ సరిహద్దులలో, కారడవులలో, మంచుకొండలలో మైనస్ డిగ్రీ చలినుండి యాభయ్ డిగ్రీవేడిని కూడా తట్టుకుంటూ అతిశీతల, అతివేడి ప్రదేశాలలో ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలను వదిలి దేశంకోసం అహోరాత్రులు ఎండనకా వాన అనక దేశ సరిహద్దులలో పనిచేసే సైనికుడికి నేటి ప్రభుత్వాలు సీత కన్నుతో చూస్తున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో జాప్యం చేస్తూ నిరుద్యోగ నిర్ములనలో విఫలం అవుతున్నాయన్నారు. బ్యాక్ లాగ్ పోస్ట్లు భర్తీచేయకుండా అన్ని సామాజికవర్గాలకు కార్పొరేషన్ లు ఉన్నాయ్ కానీ మాజీ సైనికులకు కార్పొరేషన్ ఇవ్వకుండా దశాబ్దాలపాటు కాలయాపనచేస్తూ మాజీసైనికులను పట్టించుకోవటం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులలో జాతీయ సంఘాలు ఏరుదాటిన తరువాత తెప్పతగలేసిన చందంగా దక్షిణభారత మాజీసైనికులను అసలు పట్టించుకోవటం లేదన్నారు. తప్పని పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లో జాతీయ మాజీ సైనిక ఏర్పాటు జరిగిందన్నారు. ఆదివారం విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న స్వతంత్ర సమరయోధుల భవనంలో సమైక్య కృష్ణాజిల్లా మాజీసైనిక సంక్షేమ సంఘం & ఇన్ ఓ (ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గనైజేషన్, ప్రెసిడెంట్) జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో అన్ని నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యు లతోపాటు రెండు జిల్లాల కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గ మరియు జిల్లా కమిటీలో రాష్ట్ర కమిటీలో కూడా మాజీ సైనిక కుటుంబాల మహిళలు సభ్యులుగా పాల్గొన్నారు.
చీఫ్ గెస్ట్ గా ఇన్ ఓ (ఇంటిగ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గనైజేషన్, నేషనల్ ప్రెసిడెంట్ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటూరి శంకర్ రావు రాష్ట్రంలోని వివిధ అసోసియేషన్ల అధ్యక్షులు హాజరై సలహాలు సూచనలు అందించారు. వక్తలు మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం పోరాడుతామని చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం ధారపోస్తామన్నారు. మాజీ సైనికులమైనా కూడా మేము ఏ క్షణంలోనైనా దేశ రక్షణకు సిద్ధంగానే ఉన్నామన్నారు. కొన్ని సందర్భాల్లో మాజీ సైనికులకు ప్రభుత్వం గౌరవంగా ఇచ్చే భూములను కూడా కొందరు కబ్జా చేస్తున్నారని అటువంటి వాటిపై ప్రభుత్వాలు దృష్టి సారించి చర్యలు తీసుకొని మాజీ సైనికులకు రక్షణ కల్పించాలన్నారు. మాజీ సైనికుల సంక్షేమానికి, వారి ఆస్తులకు, జీవితాలకు, భద్రత కల్పించాలన్నారు. మాజీ సైనికులకు ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున అండగా నిలబడతాం అన్నారు. జై జవాన్ అని నిరూపిద్దాం అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ముమ్మనేని గోపాలకృష్ణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఖలీల్, కోశాధికారి టి రమేష్ లను, కృష్ణాజిల్లా ఇన్ ఓ మరియదాసు లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అలాగే అన్ని జిల్లాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాచరణ తెలియజేశారు. అనంతరం మాజీ సైనికుల ఆరోగ్యం, సంక్షేమం, సమస్యలపై కార్యాచరణ పై చర్చించుకుని అధికారులు, వివిధ సంఘాల నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తెలుగు రాష్ట్రాల మాజీ సైనికులు, మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం

-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు -అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *