Breaking News

రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని, అలాగే నిర్దేశించిన లక్ష్యాలను రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు.
మచిలీపట్నం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి మంగళవారం సాయంత్రం ఆయన ఓటిఎస్, గృహ నిర్మాణాల ప్రగతిని ఆర్డీవోలు, స్పెషల్ ఆఫీసర్స్, ఎంపిడివోలు, తహశీల్దార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించి ఓటియస్‌లో రిజిస్ట్రేషన్, డిజిటల్ సైనింగ్, వంటి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వన్‌టైమ్ సెటిల్మెంట్‌లో ఆన్‌లైన్‌ డేటాకు ఆఫ్‌లైన్ డేటాకు మధ్య వ్యత్యాసం ఉండరాదన్నారు. పంచాయతి సెక్రటరీలకు డిజిటల్ అసిస్టెంట్లకు సమన్వయం ఉండాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు దిగువ స్థాయి సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల తహాశీల్దార్లు ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఓటిఎస్ ప్రక్రియను అమోదించాలని అనంతరం ప్రింటింగ్ ప్రక్రియ, డాక్యుమెంట్, విఆర్వో అమోదం, అనంతరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కలిగిన పంచాయతీ సెక్రటర్లు, స్కానింగ్ అప్రూవల్ చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
అదేవిధంగా తహాశీల్దార్లు, ఎంపిడివోలు స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓఓఎస్‌పై సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సర్వర్, ఇంటర్నెట్, పవర్ తదితర సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం ద్వారా ఓటిఎస్ ప్రక్రియను వేగవంతం చేయగల‌మ‌న్నారు. పంచాయతీ సెక్రటరీలు తమతో పాటు వాలంటీర్లను కూడా తీసుకెళ్లడం ద్వారా డాక్యుమెంటేషనకు అవసరమయ్యే ఆధార్, ఫోటోస్ తదితర వాటిని సేకరించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు యూజర్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి ప్రభుత్వం వంద శాతం మినహాయింపు కల్పించినట్లు కలెక్టర్ సందర్భంగా చెప్పారు. డాక్యుమెంట్ ఉపయోగాన్ని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. మండలవారీగా డాక్యుమెంట్ల సేకరణపై ఆయన ఆరా తీశారు. జిల్లాలో ఉయ్యురు , పెడన మునిసిపాలిటీల పరిధిలో గృహ నిర్మాణ పనులలో పురోగతి లేదని సంబంధిత కమిషనర్లను వివరణ కోరారు. ఉన్నాయని సెటిల్మెంట్‌ (ఓటిఎస్) ప్రక్రియ ఏ స్థాయిలోనూ పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల వ్యవధిలో ఈ-కె వై సి యాప్ అందుబాటులోనికి రానుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల , డి ఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, హోసింగ్ పి డి కె. రామచంద్రన్, డి పి ఓ ఏ డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *