-జగనన్న విద్య కానుక పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమం మాజీ మంత్రి పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అధ్యక్షతన మంగళవారం పెనమలూరు జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కోలుసు పార్థసారథి, పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్ లతో కలిసి విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ గావించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో దేశంలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి ఏడాది జిల్లాలో విద్యా రంగం లో సుమారు 500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని అన్నారు. పేద తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా, డ్రాప వుట్స్ తగ్గించేందుకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి ఏడాదికి 15 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని, పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, జగనన్న విద్య కానుక వంటి పథకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు కలిగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు
పెనమలూరు జడ్పీ స్కూల్లో పరిశుభ్ర వాతావరణం తరగతి గదులు, ఆధునిక సాంకేతిక వసతులతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల హెచ్ఎం వై దుర్గా భవానిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పెనమలూరు పాఠశాలను మోడల్ పాఠశాలగా డిక్లేర్ చేస్తూ మరింత అభివృద్ధి చేస్తామాన్నారు.
కృష్ణా జిల్లాలో 25 మండలాల్లో 1461 పాఠశాలకు చెందిన 1,29,921 విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
సభకు అధ్యక్షత వహించిన పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆర్థిక స్థితి కారణంగా రాష్ట్రంలో ఏ పిల్లవాడు చదువుకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని, కేవలం అమ్మఒడికే 20 వేల కోట్లు, విద్యా కానుకకు 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ విద్య లేనిదే మానవ మనుగడ లేదని ఈ విషయం గమనించి ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేశారన్నారు. పేదలకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తొలుత పాఠశాల హెచ్ఎం వై. దుర్గాభవాని నేతృత్వంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, టిడ్కో డైరెక్టర్ పి రాఘవరావు, స్థానిక సర్పంచ్ లింగాల భాస్కరరావు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొనగా,
వివిధ శాఖల అధికార వర్గానికి సంబంధించి డీఈవో తాహీరా సుల్తానా, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. శేఖర్, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, తాసిల్దారు భద్రు, ఎంపీడీవో జె. విమ కుమారి, ఎంఈఓ కనకమహాలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News