విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీభాధ్యతలు నిర్వహించిన కాలంలో కీర్తిశేషులు దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్‌రెడ్డి 73వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ భాధ్యతలు నిర్వహించిన కాలంలో కీర్తిశేషులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 అంబులెన్స్ సేవలు, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఫీజురీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య వంటి వినూత్నపథకాలను అమలు చేయడం ద్వారా కీ.శే.డా. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కలెక్టర్ డిల్లీరావు కొనియాడారు.
Prajavartha Online Telugu News