అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శిల్పారామం 6వ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం రజత్ భార్గవ,ఐఎఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టూరిజం డిపార్ట్‌మెంట్ వారి అధ్యక్షతన మంగళవారంఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించబడిరది. ఆర్థిక సంవత్సరం 2020-2021 గణంకాలను ఆమోదించటం జరిగినది. మరియు శిల్పారామ నిర్వహణ సంబందించి విధి విధానాలను పరిశీలించి భారత ప్రభుత్వం హస్తకళలు మరియు చేనేత విభాగాల ద్వారా అర్పన్ హాట్ అనుమతుల కోసం నివేదికలు సమర్పించవలసినదిగా ఆదేశించటం, జరిగినది, శిల్పారామాలు వినూత్నమైన రీతిలో అభివృద్ధి పరచటానికి మరియు రాష్ట్రంలో నూతన జిల్లాలు ఎర్పడిన దృష్ట్యా అన్నీ జిల్లాలు నందు శిల్పారామంలు అభివృద్ధి చేయటం కోసం స్థలాల కేటాయింపు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్లను కోరటం జరిగింది. కోవిడ్ – 19 మహమ్మరి వల్లన 2020-21 సంవత్సరాలలో శిల్పరామం పార్కులు ముసివేయటం జరిగినది. దీనివల్ల శిల్పారామం ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది దానిని అధికమించడం కోసం రూ. 350.00 లక్షలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ప్రతిపాదనలు సమర్పించవల్సినదిగా ఆదేశించటం జరిగినది. ఈ సమావేశంలో పోల్గొన్న కమిటీ సభ్యులు డి.శ్యామ్‌సుందర్ రెడ్డి, సిఈవో, ఎపి శిల్పారామం, కె.కన్నబాబు, ఐఎఎస్, టిఎస్‌ఎన్.రెడ్డి, ఎడి హ్యాండ్లూమ్స్, ఎన్.అపర్ణలక్ష్మీ, ఎడి హ్యాండీక్రాఫ్ట్స్, ఎం.నాగేశ్వరరావు, జెడి హ్యాండ్లూమ్స్, ఐ.మోహనరావు, జెఎస్ ఇండస్ట్రీస్, కామర్స్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News