Breaking News

‘మన బడి: నాడు – నేడు’ సకాలంలో పనులు పూర్తవ్వాలి

-విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘మన బడి: నాడు-నేడు’ పథకంలో భాగంగా పాఠశాలల్లోని జరుగుతున్న రెండో దశ పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ‘మన బడి:నాడు-నేడు’, ‘జగనన్న విద్యాకానుక’ పథకాల అమలు తీరుపై ఆయన అధికారులను సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామాత్యులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ ను ఈ నెలఖారులోపు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమీషనర్ మరియు సమగ్ర శిక్షా ఇంచార్జి ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ , పాఠశాల విద్య సలహాదారు (ఇన్ఫ్రా) ఎ.మురళి, మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు దివాన్ మైదీన్ తదితర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *