Breaking News

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గంలో 1,825 మందికి వాహనమిత్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నాలుగో విడత ద్వారా 1,825 మందికి రూ. 1.82 కోట్ల నిధులు వారివారి వ్యక్తిగత ఖాతాలలో శుక్రవారం జమ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనున్నట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని విశాఖ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించనున్నారని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆటో డ్రైవర్లను కనీసం పట్టించుకోకపోగా.. పన్నులు, ఛలానాల రూపంలో వారి నడ్డి విరిచిందని గుర్తుచేశారు. అటువంటి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు, బాధలు స్వయంగా పాదయాత్ర ద్వారా గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. వీరిలో దాదాపు 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే ఉన్నారన్నారు. వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్ నెస్ ఫీజులను చెల్లించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందన్నారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని వినియోగించుకుని.. తమ వాహనాలను ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్హతలు ఉండి జాబితాలో పేరు లేని వారు తగిన డాక్యుమెంట్లతో వార్డు సచివాలయాలను ఆశ్రయిస్తే.. పథకం వర్తించేలా చూస్తామని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *