Breaking News

మిడిల్ ఇన్ కం గ్రూప్ లేఔట్లు కృష్ణాజిల్లాలో రెండవ ఫేజ్ లో 47… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్- మిడిల్ ఇన్ కం గ్రూప్ లేఔట్లు కృష్ణాజిల్లాలో రెండవ దశలో 47 ఉన్నాయని అందులో 14 లే అవుట్లు గుర్తించామని మరో 33 పెండింగ్ లో ఉన్నట్లు వచ్చే రెండు వారాలలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎం ఏ యూ డి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హెచ్ సి ఎం , ఎం ఐ జి లే అవుట్ ప్రత్యేక కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్- మిడిల్ ఇన్ కం గ్రూప్ లేఔట్లు స్థలాలలో 8 అడుగులకు పైగా మెరక చేయడం సమస్యగా మారిందని స్పెషల్ సెక్రటరీకి వివరించారు. డెల్టా ప్రాంతంలో 50 సెంట్ల ప్లాట్ లను గుర్తించడం సైతం కష్టమైనప్పటికీ లక్ష్యాలను చేరుకొంటామన్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లు ప్రభుత్వం అన్ధంచనుందని తెలిపారు. ప్రభుత్వమే లేఔట్లు వేసి ప్లాట్లను ఇస్తుందని ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్) లేఔట్లలో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే ప్లాట్‌ కేటాయిస్తామని ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అలాగే స్థలం కొనుగోలు చేసే వ్యక్తికి 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.అలాగే లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలని అలాగే, ఆధార్‌ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వమే 3 విభాగాలలో ఎంఐజీ-1 కింద 150 గజాలు, ఎంఐజీ-2 కింద 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాల స్థలాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా లేఔట్‌లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు వుంటాయని చెప్పారు.అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన. నగరాలు, పట్టణాల్లోని మార్కెట్‌ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్‌ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి తెలిపారు. ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును నాలుగు విడతల్లో కట్టే అవకాశం ఉంటుందని, ఒకే విడతలో డబ్బు కట్టే వారికి 5 శాతం రాయితీ ఉంటుందని చీఫ్ సెక్రటరీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *