Breaking News

నాడు నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

-విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
-జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
-పది రోజుల్లో 100 శాతం పనులు ప్రారంభించాలి
-పాఠశాలల విలీనం పరిస్థితులపై దృష్టి పెట్టాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన బడి: నాడు- నేడు రెండో దశలో భాగంగా పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి మన బడి: నాడు-నేడు పనుల తీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ & సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇంచార్జి) ఎస్.సురేష్ కుమార్, పాఠశాల విద్యా సలహాదారు (ఇన్ప్రా) ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్.దీవెన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ కాన్ఫరెన్సులో విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రెండో దశ మన బడి: నాడు – నేడు పనుల కింద 22344 పాఠశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 20757 పాఠశాలల వివరాలను నాడు నేడు ఎస్టీఎంఎస్ (స్కూల్ ట్రాన్సఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం) వెబ్ సైట్ నందు ఉంచామన్నారు. మొత్తం 22344 పాఠశాలల్లో పనులను పదిరోజుల్లో 100 శాతం ప్రారంభించాలని కోరారు. దీనికి సంబంధించిన కావల్సిన అన్ని రకాల అనుమతులను జిల్లా కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. నాడు నేడు పనుల కోసం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 10891 పాఠశాలలకు రూ.554 కోట్లు నిధులు రివ్వాల్వింగ్ ఫండ్ ఇచ్చామన్నారు. మిగిలిన వాటికి కూడా నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

కలెక్టరు పర్యవేక్షించాలి 
ఈ సమావేశంలో భాగంగా జిల్లాల కలెక్టర్లతో మంత్రి నాడు నేడు రెండో దశ పనుల తీరుపై, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు పనులు సకాలంలో పూర్తి చేస్తూ విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో, మిగతా అధికారులు కూడా పూర్తి సమన్వయంతో పనిచేసి ఫలితాలను సాధించాలన్నారు. స్టాకు పాయింట్లకు చేరిన ఇసుకను సంబంధిత పాఠశాలలకు తరలించాలని అన్నారు. ఇసుక, సిమెంట్ సరఫరాలో జాప్యం జరిగితే సంబంధిత కంపెనీ యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్లను మాట్లాడి తెప్పించాలని కోరారు. పనులు నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని, ఈ పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లను కోరారు.

పాఠశాల విలీనం పరిస్థితులపై దృష్టి 
ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతోనే పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు తలెత్తినా స్థానిక అధికారులు స్పందించి బేషజాలకు పోకుండా సత్యాసత్యాలు తెలుసుకొని, వాటిపై సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కార దిశగా ఆలోచించాలని కలెక్టర్లు, ఆర్డీవోలను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *