-పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టం (12)సి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ విద్యాహక్కు చట్టం కమిటీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో విద్యాహక్కు చట్టం కమిటీ సభ్యులతో ఫీజులు ఖరారుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలు తీరుపై తీసుకోవాల్సిన చర్యలు గురించి తగు సూచనలు సలహాలు కమిటీ సభ్యులు తెలిపారని అన్నారు. విద్యా హక్కు చట్టం (12)సి ప్రకారం 25 శాతం సీట్లను ప్రైవేటు పాఠశాలల్లో భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్,అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో రూ.15,000/ ఫీజు అని అని ఖరారు చేశామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 12(1) సి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందించడం జరిగిందని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయకార్యదర్శి బి.శ్రీనివాసులు, పాఠశాల విద్య శాఖ కమిషనర్ & సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇంచార్జి) ఎస్.సురేష్ కుమార్, కమిటీ సభ్యులు ఎం.వి.రామచంద్రారెడ్డి, కె.చంద్రశేఖర్, కె.శ్రీకాంత్ బాబు, డా.సీహెచ్ కీర్తి, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News