Breaking News

సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…

-ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎండీ రుహుల్లా 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అర్హులైన 13,979 మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా 13 కోట్ల 97 లక్ష 90 వేల రూపాయల లబ్ది చేకూర్చడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎండీ రుహుల్లా తెలిపారు. నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని డాబా కోట్లు సెంటర్ వద్ద ఎమ్మెల్సీ కార్యాలయం ఆవరణంలో వాహన మిత్ర పథకం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారనీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎండీ రుహుల్లా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టన్ నొక్కి డ్రైవర్ల ఖాతాలలో ఆర్థిక సహాయాన్ని జమ చేశారన్నారు. వీరిలో 23 మంది బ్రాహ్మణ, 267 మంది మైనారిటీ, 26 మంది క్రిస్టియన్ మైనారిటీ, 9448 మంది ఇబిసి, 1408 మంది కావు, 4030 మంది ఎస్సీ, 656 మంది ఎస్టీ, 349 మంది రెడ్డి, 302 మంది. కమ్మ, 25 మంది ఆర్యవైశ్య, 9 మంది క్షత్రియ వర్గాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేసుకోవాలన్నారు.

అనంతరం 59 వ డివిజన్ కార్పొరేటర్ షాహిన సుల్తాన హఫీజుల్లా మాట్లాడుతూ 59 వ డివిజన్ లో 131 మంది లబ్ధిదారులకు వాహన మిత్ర పథకం ద్వారా మనిషికి పది వేల రూపాయలు బ్యాంకు అకౌంట్ లో నేరుగా జమ అయ్యాయని తెలిపారు. జగనన్న పాదయాత్రలో డ్రైవర్ల కష్టాలను గుర్తించి “నేను వినాను..నేను ఉన్నాను”అని బరోసా ఇచ్చిన విధంగా ఒక్కొక్క డ్రైవర్కు సంవత్సరానికి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. ఆటో క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక కష్టాలలో పాలుపంచుకుంటున్న ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *