మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారులు గాని మహిళలు లేదా వృద్దులు ఎక్కడైనా వంటరిగా నిలిచిపోయారంటే, వారి తరుపువాళ్ళు ఫోన్లో అడిగే తొలిప్రశ్న ఆ సమీపంలో ఏమైనా ఆటో ఉందా అని అడుగుతున్నారని ఇది మన సమాజంలో ఆటో డ్రైవర్ సోదరుల పట్ల నమ్మకంకు ఒక మంచి ఉదాహరణని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం వరుసగా నాల్గవ ఏడాది అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్ లకు ప్రభుత్వం ఆర్థిక సాయం క్రింద అందిస్తున్న రూ.10 వేలును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వై.ఎస్. ఆర్ వాహన మిత్రలో దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ వెల్లడించారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సారానికి 10,272 మంది లబ్ధిదారులు వాహనామిత్ర పథకానికి దరఖాస్తు చేసుకొంటే వారికి 10 కోట్ల 29 లక్షల 20 వేల రూపాయలు శుక్రవారం వారి ఖాతాలలో జమ కాబడినట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో ఆటో రిక్షాలు 8,922 , మోటార్ క్యాబ్స్ లు 1,191 మ్యాక్సీ క్యాబ్ లు 132, లక్స్జరి టూరిస్ట్ క్యాబ్ లు 35 , సెమి లక్స్జరి టూరిస్ట్ క్యాబ్ లు 12 లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కృష్ణాజిల్లాలో 2019 -20 ఆర్ధిక సంవత్సరంలో 26,702 మంది లబ్ధిదారులకు 26 కోట్ల 70 లక్షల 20 వేల రూపాయలు, 2020 – 21 ఆర్ధిక సంవత్సరంలో 29, 965 మంది లబ్ధిదారులకు 29 కోట్ల 96 లక్షల 50 వేల రూపాయలు, 2021- 22 ఆర్ధిక సంవత్సరంలో 27,165 మంది లబ్ధిదారులకు 27 కోట్ల 12 లక్షల 10 వేల రూపాయలతో కలిపి ఈ నాలుగు సంవత్సరాలలో 94 కోట్ల 8 లక్షల రూపాయలు వాహనామిత్ర పథకం కింద లబ్ధిదారులకు అందించినట్లు జిల్లా కలెక్టర్ రంజిత బాషా తెలిపారు.
వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఇన్సూరెన్స్ కంపెనీ చేత థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని, చక్కని ఫిట్నెస్ సర్టిఫికెట్ కల్గి, డ్రైవింగ్ లైసెన్స్ కల్గివుండాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం తాగి వాహనం నడపొద్దని మిమ్ములందరిని కోరుతున్నానని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో సీఎం జగన్ చూశారని, కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో ఉపయోగపడిందని అన్నారు. వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,61, 516 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవ ర్ లకు ప్రభుత్వం 261. 51 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికె ఆ కీర్తి దక్కిందని ఆమె అన్నారు.
అనంతరం జి. రాజేశ్వరరావు, దేవనబోయిన రమేష్, ముచ్చు నాగబాబు, శీలం శ్రీనివాసరావు, గంగాధరరావు, తలారీ బాబురావు, సి హెచ్ పవన్ కుమార్, గంటా శ్రీనివాసరావు తదితర డ్రైవర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్ తదితరులు 10 కోట్ల 29 లక్షల 20 వేల రూపాయల మెగా చెక్కును అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ ఛైర్మెన్ గద్దె నాగేశ్వరావు, మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బందెల కవితా థామస్ నోబుల్, డి ఆర్ ఓ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ. కిషోర్, జెడ్పి డిప్యూటీ సిఇఓ శ్రీనివాసరావు, డి టి ఓ సీతాపతిరావు, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News