Breaking News

7000 మెగావాట్ల సౌర విద్యుత్ కు సెకి తో ఒప్పందం – ఒక చారిత్రాత్మక ఘట్టం

-నిర్విఘ్నంగా 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ సరఫరా
-రైతు సేవ లో తరిస్తున ప్రభుత్వం – దేశంలోనే కొత్త ప్రయోగం
-విశాఖలో “ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య” కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని
-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ వినియోగదారులతో జులై 30 న సమావేశం కానున్న ప్రధాన మంత్రి
-విద్యుత్ రంగం గత 8 ఏళ్లలో సాధించిన విజయయాలను వినియోగదారులకు వివరించనున్న ప్రధాని
-రాష్ట్రం లో ఈ నెల 25 నుంచి 31 వరకు ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య ఉత్సవాలు
-ప్రధాన మంత్రి కార్యక్రమం పై ఇంధన శాఖ మంత్రి సమీక్ష … అధికారులకు ఆదేశాలు
-విద్యుత్ రంగానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం …. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
-కేంద్ర విద్యుత్ శాఖ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుకు రూ 1700 కోట్లు విడుదల చేసింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ రంగానికి వచ్చే 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ సరఫరా కు భరోసా కల్పించే నిమిత్తం కేంద్ర విద్యుత్ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుండి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది . దీనివల్ల రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతం కావడంతో పాటు రైతాంగం పెద్ద ఎత్తున ప్రయోజనం పొందనుంది.
వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా ను బలోపేతం చేయటానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. వచ్చే 25 ఏళ్ళ పాటు వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కొనసాగించేందుకు సికి తో దీర్ఘ కకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యవసాయానికి వచ్చే 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయటం కోసం సైకి తో ఇంత భారీ ఒప్పందం కుదుర్చుకున్న ఘనత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే దక్కుతుంది. దీనిలో భాగంగా మొదటి దశ లో సెప్టెంబర్ 2024 నాటికీ 3000 మెగా వాట్లు, రెండవ దశలో 2025 నాటికీ మరో 3000 మెగావాట్ల, మూడవ దశలో మరో 1000 మెగావాట్ల చొప్పున సెకి సౌర విద్యుత్ ను రాష్ట్రానికి సరఫరా చేయనుంది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్ట్ స్టోరేజి హైడ్రో పవర్ ప్రోజెక్టులను వివిధ జిల్లాలో తలపెట్టనుంది. అంతే గాక పునరుత్పాదక ఇంధనాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది వ్యవసాయ విద్యుత్ సరఫరాను బలోపేతం చేసి రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుకు రూ 1700 కోట్లు విడుదల చేసింది. ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య కార్యక్రమం లో భాగంగా ఈ నెల 30 న ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాలలోని విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. ఇందుకోసం మన రాష్ట్రంలోని విశాఖ ను ఎంపిక చేయటం జరిగింది . ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర విద్యుత్ శాఖకు సంబందించిన వివిధ పథకాలను రాష్ట్రంలో విజయవంతగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సాంకేతికంగా, ఆర్థికంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ కు సంబంధించి సెకి తో ఒప్పందం తో పాటు విద్యుత్ రంగంలో తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యలన్నీ కూడా ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు కు నిదర్శనం అని మంత్రి పేర్కొన్నారు.
ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే విజయానంద్ మాట్లాడుతూ విశాఖపట్నం లోని ప్రధాన మంత్రి వీడియో కన్ఫెరెన్స్ తో పాటు ఈ నెల 25 నుండి వారం రోజుల పాటు జరగనున్న ఉజ్వల్ భారత్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె విజయానంద్ ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించింది. రాష్ట్రంలో ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య ఉత్సవాలు ఈ నెల 25 నుండి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించవల్సిందిగా కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించవల్సిందిగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ ఆదేశాలిచ్చారు.
విశాఖపట్నం లో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ జాయింట్ సెక్రటరీ పీయూష్ సింగ్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది . బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం)తోను, రాష్ట్ర ప్రభుత్వంతోను నిరంతరం సంప్రదింస్తున్నారు .
విద్యుత్ రంగ విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 30 న విశాఖపట్నం లో నిర్వహిస్తున్న ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వినియోగదారులతో మాట్లాడనున్నారు.విద్యుత్ రంగంలో దేశం గత 8 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. అలాగే 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తికానున్న సందర్భంగా , విద్యుత్ రంగ భవిష్యత్ ప్రణాలికను కూడా ప్రజలకు తెలియచేయనున్నారు .
ఏపీఎస్ఆసిఎం సమన్వయముతో కర్నూల్, విశాఖపట్నం , తూర్పు గోదావరి, నెల్లూరు, అనంతపూర్ జిల్లాలలో , ఒక్కో జిల్లాకు రెండు ప్రాంతాలు చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే రురల్ ఎలెక్టిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ ఈ సి) 4 జిల్లాకు , నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసి)కు 12 జిల్లాలు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (పీ జీ సి ఐ ఎల్) కు 5 జలాలు జిల్లాలు ఎంపిక చేయటం జరిగింది. ఎంపీలు, ఎం ఎల్ ఏ లు ,ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.
సి ఎండీ , ఏ పీ ట్రాన్స్కో , బీ శ్రీధర్, జె ఎం డీ హెల్త్ ఆర్ డీ , ఐ పృద్వి తేజ్, జె ఎం డి విజిలెన్స్ , బీ మల్లా రెడ్డి, డిస్కామ్ సి ఎం డీ లు , కీ సంతోష రావు, జె పద్మ జనార్ధన రెడ్డి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *