Breaking News

ఆగస్టు15 నుండి ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసందాన ప్రక్రియ ప్రారంభం…

-ఆధార్‌ అనుసందానం పై రాజకీయపార్టీల ప్రతినిధులుకు ప్రజలకు అవగాహన సదస్సులు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు ఫోటో గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసందానం ప్రక్రియను ఆగస్టు15వ తేదీ నుండి ప్రారభించేలా చర్యలు తీసుకుంటామని దీనిపై రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రజలలో అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు.
ఓటరు ఫోటో గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసందానంపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా గురువారం రాష్ట్రానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజికవర్గాల పరిధిలో సుమారు 16.50లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. 1779 బూత్‌ లెవల్‌ అధికారులు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారి సూచనల మేరకు ఫార్మం 6 బి ప్రకారం ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసందానం చేసే ప్రక్రియను ఆగస్టు 15 తేది నుండి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇందుకు తగిన విధంగా ప్రక్రియను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేది నుండి రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలతో సదస్సు నిర్వహించి ఓటరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసందానం చేసుకునేలా అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసందానం చేసుకోవాల్సి వుంటుందని ఆధార్‌ లేనివారు ఎన్నికల సంఘం చూచించిన 11 డాక్యుమెంట్లు ఎదోఒకదానిని సమర్పిచవలిసి ఉంటుందన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడం ద్వారా రోజుకు ఒక్కొక్క బూత్‌ లెవల్‌్‌ అధికారి 10 మంది ఓటర్ల నుండి ఆధార్‌ వివరాలను సేకరించి ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్‌ అనుసందానం చేయడం ద్వారా 100 రోజులలో 1779 బూత్‌ లెవల్‌ అధికారులు 16.50లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులకు ఆధార్‌ అనుసందాను ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిచామన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ అనుసందానం ప్రక్రియ పూర్తి చేసి డిజిటలైజేషన్‌ చేయయున్నట్లు జిల్లా కలెక్టర్‌ వివరిచారు. ఆధార్‌ అనుసందానం ప్రక్రియ పై పొలింగ్‌ బుత్‌ స్థాయి అధికారులు తహాశీల్థార్లు రెవెన్యూ మున్సిపల్‌ అధికారులకు శిక్షణ అందించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఆధార్‌ అనుసందానంలో ప్రక్రియతోపాటు 18 సంవత్సరాల నిండిన వారికి ఓటు హక్కును కల్పించడం ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేసిలా చర్యలు తీసుకుంటామని, గతంలో జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులో మార్పు చేెర్పులుకు అవకాశం కల్పించి మరణించిన వారి పేర్లను ఇతర జిల్లాలకు వలస వెళ్ళిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం వంటి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, ఓటర్ల జాబితా పర్యవేక్షకులు ఆశయ్య, బూత్‌ లెవల్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *