Breaking News

బాలల రక్షణ కోసం పనిచేసేందుకు స్వచ్చంద సంస్థలు ధరఖాస్తు చేసుకోండి..

-బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ చైర్మన్‌ కె. అప్పారావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల సంక్షేమం రక్షణ సంరక్షణ కొరకు పనిచేసే స్వచ్చంద సంస్థల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ చైర్మన్‌ కె. అప్పారావు ప్రకటనలో తెలిపారు. బాలల సంక్షేమం రక్షణ హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ వారి సమన్వయం భాగస్వామ్యంతో పనిచేసే స్వచ్చంద సంస్థలు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. బాలల సంక్షేమం రక్షణ హక్కుల పై క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించడం శిక్షణ అవగాహన సదస్సులు సెమినార్లు నిర్వహించడం వంటి కార్యక్రమాలను కమీషనర్‌ సహకారంలో చేపట్టవలసి ఉంటుందన్నారు. పోలీస్‌, విద్య, వైద్య, ఆరోగ్యం, కార్మిక, రైల్వే, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, బిసి ఎస్సీ ఎస్టీ న్యాయ శాఖలు జూవైనెల్‌ వెల్ఫెర్‌, చైల్డ్‌లైన్‌ వటి బాలల కోసం పనిచేస్తున్న ముఖ్యమైన శాఖల సమన్వయంతో బాలల సంక్షేమం రక్షణ హక్కుల కోసం పనిచేయవలసి ఉంటుందన్నారు. బాలల కోసం పనిచేయాలనే ఆశక్తి కలిగి జిల్లాలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు వారి పూర్తి వివరాలతో ఆగస్టు 15తేది లోపు కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరోణ కమిషనర్‌ రూమ్‌ నెం 511, 4వ అంతస్తు యంజియం కాపిటల్‌ బిల్డింగ్‌, చినకాకానీ, మంగళగిరి, గుంటూరు జిల్లా చిరునామకు గాని email Id : apscpcr2018 @gmail.com ద్వారా ధరఖాస్తులను సమర్పించాలని బాలల హక్కుల పరిరక్షణ కమీషన్‌ చైర్మన్‌ అప్పారావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *