Breaking News

ఉపాధి హామీలో చెరువులను అభివృద్ధి చేసి అమృత్ సరోవర్ కి సిద్ధం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాధీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జల జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన చెరువులను సుందరీకరించి ఆగష్టు 15న అమృత్ సరోవర్ ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు .
అజాధీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అమృత్ సరోవర్ కార్యక్రమం కింద జిల్లాలో మంజూరైన 17 చెరువుల అభివృద్ధి పనులపై శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎపిడిలు, ఫీల్డ్ ఆఫీసర్ తో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అజాధీ కా అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా జల జీవన్ మిషన్ నిధులతో జిల్లాకు 17 చెరువులను అభివృధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చెరువులను అభివృధి చేయడం ద్వారా ఆయాలకట్టు భూములకు సాగు నీరు సరఫరా పశువులకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం భూగర్భజలాల మట్టాలను పెంపొందించేందుకు దోహద పడతాయన్నారు. జిల్లాలోని చందర్లపాడు మండలంలో గుడిమెట్ల, పాటేంపాడు, జి. కొండూరు మండలం, చెగిరెడ్డి గూడెం, కవులూరు, కట్టుబడి పాలెం, జగ్గయ్యపేట మండలం, బోచవరం, మైలవరం మండలం, చంద్రాల, పుల్లూరు, తోలుకోడు, నందిగామ మండలం, లింగాల పాడు, వీరుల పాడు మండలం, జయంతి, విస్సన్నపేట మండలం, చండ్రపట్ల, తెల్లా దేవరపాడు గ్రామాలలో 17 చెరువులు అభివృధి చేసేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. చెరువుల పూడికతీత పనులను పూర్తి చేసి గట్లను పటిష్ట పరచాలన్నారు. చెరువు చుట్టూ గట్లపై ఫలసాయపు మొక్కలను నాటి సంరక్షణ చేర్యాలను తీసుకోవాలన్నారు. గ్రామా పంచాయితీల సహకారంతో చెరువు గట్ల వద్ద సిమెంటు బెంచీలను ఏర్పాటు చేసి పార్కు వలె రూపకల్పన చేసి గ్రామా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పూర్తి చేసిన పనులకు చెల్లింపులు జరిపేందుకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు చెరువుల అభివృధి పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీన ప్రతి చెరువు వద్ద స్వాతంత్ర్య సమరయోధులు, స్థానిక ప్రజా ప్రతినిధులను, గ్రామా ప్రజలను, విద్యార్థిని విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేసి అమృత్ సరోవర్ ఉత్సవాన్ని జరిపేందుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సునీత సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. టెలీకాన్ఫెరెన్స్ లో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జె. సునీత, మండల అభివృధి అధికారులు, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *