Breaking News

హలో మాల… చలో ఢిల్లీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడలో హోటల్ నందు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వర్గీకరణకు మద్దతు తీస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరియు ఇతర రాజకీయ పార్టీల విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాల మాదిగల మధ్య చిచ్చుపట్టి ఎన్నో సంవత్సరాల నుండి కలిసి ఉన్న మాల మాదిగలను ఎస్సీ వర్గీకరణ సాధ్యపడని చంద్రబాబు నాయుడు కు తెలిసి ఆనాడు మాదిగ సామాజిక వర్గం ఓట్లు బ్యాంకు కోసం చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఉత్తీర్ణులను మరియు ఆర్డివన్స్ ఇచ్చి నా న్యాయస్థానం ముందు నిలవలేదు. అయినా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఒక సామాజిక వర్గం నాయకులతో ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఢిల్లీలో పావులు కదుపుతున్నారు అని అన్నారు
వర్గీకరణకు వత్తాసు పలికే నాయకులు చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈనెల 5వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ ధనాచౌక్ వద్ద నిరాహార దీక్ష తలపెట్టి నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని బిజెపికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలు ఈ వర్గీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత విచ్ఛిన్న వాదుల నుండి డిమాండ్లు వస్తాయని ముందే పసికట్టిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా వర్గీకరణ లాంటి అంశాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన రీతిలో చట్టాలను మార్పు చేసి పెట్టారు అని తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నన్నేటి.పుష్పరాజ్, టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *