Breaking News

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విన్నవించిన పలువురికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఐదుగురికి కుల, ఇద్దరికి ఆదాయ, ఒకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రయోజనం చేకూరాలన్న తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమం మొదలు సర్టిఫికెట్ల జారీవరకు నిలువునా దోచుకుంటే.. జగనన్న ప్రభుత్వం పారదర్శకంగా గడప గడపకు వెళ్లి అర్హులను వెతికి లబ్ధి చేకూరుస్తోందని వెల్లడించారు. తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన వెనువెంటనే పరిష్కారం చూపడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్.ఐ.(రెవెన్యూ) ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *