Breaking News

జిల్లాలో 276 మంది ఆరోగ్య సహాయ కార్యదర్శులకు సర్వీసు క్రమబద్దీకరణ…

-కలెక్టరు మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ స్థాయి లోని సచివాలయ వ్యవస్థ లో వైద్య సేవలందిస్తున్న 276 మంది ఆరోగ్య సహాయ కార్యదర్శులకు సర్వీసు క్రమబద్దీకరణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ఆహోగ్య సహాయ కార్యదర్శులుగా సర్వీసు క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సచివాలయ పరిధిలో ఆరోగ్య సహాయ వైద్య సేవలు అందిస్తున్న 276 మంది ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేసినట్లు తెలిపారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు లభించిన దృష్ట్యా మీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ స్థాయి లోనే ప్రజలకు నేరుగా సేవలందించే వారిని గుర్తించడమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించినందున మరింత నిబద్దత తో పనిచేయాల్సి ఉంటుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికపుడు ప్రజలను చైతన్యం చేస్తూ మెరుగైన సూచనలు, సలహాలు అందించే క్రమంలో బాధ్యత తో వ్యవహరించాలని సూచించారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డా. ఎం. వసుంధర, డిప్యూటీ డిఏంహెచ్ఓ డా. వరలక్ష్మి, ఏ ఎన్ ఎం లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *