-వీడియో కాన్ఫరెన్స్ లో స్కీమ్స్ వారీగా సమీక్ష
-గడప గడపకు వొచ్చే ఫిర్యాదులు .. వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యల పరిష్కారం కోసం స్థిరమైన సంస్కరణలు దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ వి సి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పనులు, స్టేజ్ కన్వర్షన్ కోసం ప్రతి మండలానికి 100 టార్గెట్ నిర్ణయిస్తే, ఆ మేరకు కూడా ప్రగతి చూపక పోవడం ఏమిటని ప్రశ్నించారు. సమస్య వలన ప్రగతి సాధ్యం కాలేదన్న మాటలు వినడానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం లేదన్నారు. వృత్తి భాధ్యత తో పాటు వ్యక్తిగత శ్రద్ద కూడా లక్ష్య సాధనకు ప్రధాన కారణం అనే విషయం గుర్తెరిగి పనిచేయాలని కలెక్టర్ తెలియచేశారు. నాడు నేడు పనుల విషయంలో ఎంపిడివో ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి, పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యత తీసుకునే అధికారులు ఆ పదవి అలంకార ప్రాయంగా కాకుండా చూసుకోవాలన్నారు. నియోజక వర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నాడు నేడు కింద స్కూల్స్ పనులకు జాప్యం లేకుండా స్థలం లేదని కాకుండా స్థిరమైన భవన నిర్మాణం కోసం పరిపాలన పరమైన అనుమతులకు ప్రతిపాదనలు తనకు పంపి ఆమోదం పొందాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. పంచాయతీ రాజ్ ద్వారా చేపట్టే ప్రాధాన్యత భవనాలు నిర్మాణం కోసం స్థలాలు గుర్తించే పనులు వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్థానిక ప్రజా ప్రతినిధి సహకారం పొందాలని మాధవీలత సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు స్థలం ఉచితంగా అందచేసే వారు సూచించిన పేర్లు ఆ భవనాలకు పెట్టే ప్రతిపాదనపై ఆలోచన చేసే దిశగా అడుగులు వేసి, భవన నిర్మాణం ప్రారంభించాలని పేర్కొన్నారు. సచివాలయ, అర్భికే, వెల్ నెస్ సెంటర్, నాడు నేడు (స్కూల్స్) తదితర పనుల పురోగతిపై మండల వారీగా సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ తో పాటు ఇకపై జాయింట్ కలెక్టర్ ప్రతిరోజూ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ అధికారులు జల జీవన్ మిషన్ పనులు మాత్రమే చేపడుతున్నా దృష్ట్యా వాటిని నూరు శాతం సాధించడం జరగాల్సిందే నని పేర్కొన్నారు.
హర్ ఘర్ తీరంగా కార్యక్రమాన్ని ఎమ్ పీ డి వో లు చక్కని ప్రణాళిక సిద్ధం చేశారని, కొవ్వూరు, నిడదవోలు మునిసిపాలిటి లు రూట్ మ్యాప్ సిద్దం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసిన దృష్ట్యా ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అధికారులు చర్యలు ఉండాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఏ.చైత్రవర్ధిని, జిల్లా వ్యవసాయ శాఖ ఆధికారి ఎస్. మాధవరావు, డిఈఓ అబ్రహం, ఆర్ అండ్ బి.ఎస్.ఈ ఎస్.బి.వి. రెడ్డి, జిల్లా హౌసింగ్ అధికారి టి.తారసింగ్, ఎస్.ఈ పీఆర్ ఏ బివి ప్రసాద్, ఆర్డబ్యూ ఎస్ఈ డి.బాల శంకర్ రావు, డీఎల్పీఓ ఎమ్. శివ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News