Breaking News

ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రావణమాసం బోనాలు సమర్పించిన భక్తులు

ఖమ్మం, నేటి పత్రిక ప్రజావార్త :
కమాన్ బజార్ రైల్వే గేటు రోడ్లో గల ముత్యాలమ్మ తల్లి అమ్మవారి వద్ద శ్రావణమాసం సందర్భంగా భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి కి బోనాలు సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది అనే నమ్మకం తో ప్రతీ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించి కోరికలు కోరుకుంటారని అన్నారు. మరియు భక్తుల పాలిట కొంగు బంగారం అయిన అమ్మవారి ప్రాంగణం లో భక్తుల కొరకు మౌళిక సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *