
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం, సాయిరాం థియేటర్ సమీపంలోని, 46వ డివిజనులో అడ్డరోడ్, కొండప్రాంతం, లంబాడిపేట నివాసితులకు ఆదివారం జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ గయాజుద్దీన్ (ఐజా) మాట్లాడుతూ నిరుపేదలకు జనసేన పార్టీ నిత్యం అండగా ఉంటుందన్నారు. పచారి సరుకులతో పాటుగా కూరగాయలు ఉచితంగా అందిస్తున్న తాము ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయటానికి వెనకాడ బోమని ఐజా ప్రకటించారు. 43వ డివిజనులో ఎన్నోఏళ్ళు నుంచి పింఛను అందుకొంటున్న ప్రశాంతి కి తాము అండగా ఉంటామని ఆమెకు ప్రభుత్వం పింఛను తిరిగి మంజూరు చేయకపోతే వచ్చే నెలనుండి తాము ప్రత్యేక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలకు నిత్యావసర సరుకుల కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఐజా తో పాటుగా సీనియర్ జనసేన పార్టీ నాయకులు మైనర్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News