Breaking News

బ్రాహ్మణ హిత్తెషి చంద్రబాబు…

-బ్రాహ్మణులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు…
-బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
2014 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి, బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటుచేసిన చంద్రబాబును రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఎవరు మరిచిపోరని, ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీని బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి శనివారం పలువురు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు, పి.వి. ఫణి కుమార్ ఆధ్వర్యంలో మచిలీపట్నం నగర కార్పోరేషన్ 45వ డివిజన్ శిడింబి అగ్రహారంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు. బ్రాహ్మణులలోని కడు పేదరికాన్ని చూసి చంద్రబాబు పాదయాత్రలో చెల్లించి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ మన రాష్ట్రంలో ఏర్పాటుచేసి బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తే, నేటి వైసీపీ పాలకులు ఆ బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేసి బ్రాహ్మణుల ఉసురు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. హిందుత్వం పై దాడిలో భాగంగా రాష్ట్రంలో 137 దేవాలయాలపై దాడులు జరిగితే, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది అన్నారు.

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏ ఆర్ కే మూర్తి మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణులకు 1000 కోట్లు నిధులు కేటాయించి బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా ఆ నిధులను నిరుపేద బ్రాహ్మణులకు సద్వినియోగం చేస్తామని వైసీపీ పాలకులు నమ్మించి బ్రాహ్మణులతో ఓట్లు వేయించుకుని బ్రాహ్మణులను విస్మరించిన ఘనత వైసీపీ పాలకులదే అన్నారు. బ్రాహ్మణులను మోసం చేసిన వారు ఎవరు చరిత్రలో నిలబడలేదు అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి కోట్ల రూపాయలను బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా బ్రాహ్మణులకు లబ్ధి చేకూరే విధంగా చేసే చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ జిల్లా ఆర్గనైజర్, పి.వి. ఫణికుమార్ మాట్లాడుతూ గత టీడిపి ప్రభుత్వంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యుడు, కొనకళ్ల నారాయణరావు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పటి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్, వేమూరి ఆనంద సూర్య ల సహాయ సహకారాలతో కృష్ణాజిల్లాలో నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా అమలు చేసామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత టీడిపి ప్రభుత్వంలో లబ్ధి పొంది పార్టీ మారిన వైసీపీ బ్రాహ్మణులు విమర్శలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అన్నారు. విమర్శలు చేసే వైసీపీ బ్రాహ్మణులు ఏ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు లబ్ధి చేకూరింది అనే విషయంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్రంలోని బ్రాహ్మణులు అందరూ తెలుసుకున్నారు అని స్వార్థపూరితంగా వ్యవహరించే వైసీపీ బ్రాహ్మణులు గ్రహించాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, వేమూరి రామకృష్ణారావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంటు నాయకులు, గాదే శ్రీనివాస్, సోమయాజుల రఘు శర్మ, బృందావనం శ్యాం కుమార్, తదితర రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *