విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో వర్షాలకు డ్రైన్లు ఓవర్ ఫ్లో కాకుండా ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని, కాల్వల మీద ఆక్రమణలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు కోబాల్ట్ పేట, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున డ్రైన్ల శుభ్రంను అధిక ప్రాధాన్యతగా విధులు నిర్వహించాలని, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ లో కాల్వల శుభ్రంకు కేటాయించాలని శానిటరీ ఇన్సెపెక్టర్లను ఆదేశించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ లో రోడ్ పక్కన ఉన్న వ్యర్ధాలను వెంటనే తొలగించాలని, కాల్వకు అడ్డుగా ఉన్న ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, రోడ్ల మీద, కాలవల్లో వ్యర్ధాలు వేసేవారి నుండి అపరాధ రుసుం విధించాలన్నారు. వీధి వ్యాపారులకు, షాప్స్ నుండి చెత్త సేకరణకు కమర్షియల్ కలెక్షన్ వాహనాన్ని సమన్వయం చేయాలన్నారు. కృష్ణ నగర్ ఈ.ఎస్.ఐ హాస్పిటల్ వరకు రోడ్ విస్తరణ జరిగిందని, మిగిలిన భాగం కూడా విస్తరణ పనులు చేయాలని స్థానిక కార్పోరేటర్ల కోరిక మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈ.ఈ.ని, ఏ.సి.పి.ని ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఈ.ఈ. సుందరామిరెడ్డి, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, కార్పొరేటర్లు బూసి రాజాలత, ఈరంటి వరప్రసాద్, ఎస్.ఎస్. రాంబాబు, ఏ.ఈ.లు, శానిటరీ ఇన్సెపెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News