విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము-పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ వారి మెమో నెంబర్ 1426943/M2/2021, ది.10.08.2022 నందు LRS – 2020 స్కీమ్ నందు అప్లై చేయబడి ఇంకనూ పెండింగ్ లోఉన్న లే-అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ధరఖాస్తులను ప్రొసెస్ చేయుటకు అనుమతి ఇచ్చినందున, విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో అనధికార లే-అవుట్ల నందలి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇప్పటికే ఆన్లైన్ లో దరఖాస్తు చేసి, ఇంకనూ అవసరమగు డాక్యుమెంట్లను సమర్పించవలసిన మరియు అపరాధరుసుము (పీనల్ రుసుము) చెల్లించవలసిన దరఖాస్తు దారులు వెంటనే ఆన్-లైన్ లో సదరు ప్రక్రియ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పొడిగించబడిన ఈ అవకాశమును వినియోగించుకొని అనధికార ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకొవలసినదిగా విజయవాడ నగర పౌరులకు తెలియజేయడమైనది. క్రమబద్ధీకరించబడని ప్లాట్లకు మౌళిక సౌకర్యములైన రోడ్లు, డ్రైన్లు, వీధి ధీపములు, మంచినీటి సరఫరా వగైరాలు కల్పించబడవు మరియు భవన నిర్మాణ అనుమతి మంజూరు ఉత్తర్వులు అనుమతించబడవని తెలియ జేయటమైనది.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News