Breaking News

లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ ప్రక్రియను వేగవంతము చేయాలి

-అధికారులకు ఆదేశాలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జగనన్న శాశ్వత గృహ పథకం క్రింద ఎంపికైన లబ్దిదారులకు ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ నందు అకౌంట్ ఓపెన్ చేయుట కొరకు సత్యనారాయణపురం సర్కిల్-2 కార్యాలయం మరియు సర్కిల్ -3 పరిధిలోని బ్రహ్మనంద రెడ్డి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లను శనివారం నగర కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంలో ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా ఎంపిక కాబడిన వారందరికి ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంక్ నాన్-ట్రాన్స్ బుల్ అకౌంట్స్ తీసుకొనుటకు లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లబ్దిదారులకు ఖాతాలను ఇప్పించాలానే కమిషనర్ వారి ఆదేశాలను అనుగుణంగా ఏర్పాటు చేసిన కేంద్రములలో నగరపాలక సంస్థ మరియు బ్యాంక్ సిబ్బంది ద్వారా జరుగుతున్న అకౌంట్స్ ఓపెన్ చేయుచున్న విధానము పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సత్వరమే అందరికి బ్యాంక్ నందు ఖాతాలు ఇప్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్దిదారులకు అసౌకర్యం కలుగకుండా అవసరమైన త్రాగునీటి సౌకర్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచిస్తూ, లబ్దిదారుల సంఖ్యకు అనుగుణంగా అధనంగా బ్యాంక్ సిబ్బందిని కూడా పెంచాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంలో సర్కిల్-2 కార్యాలయంలో గల క్యాష్ కౌంటర్ ను పరిశీలించి అక్కడ విధులలో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పన్నులు వసూళ్ళు చేయు సందర్బంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనచొ ఉన్నతాధికారులకు దృష్టికి తిసుకురావాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *