Breaking News

అర్భికే, సచివాలయ, హెల్త్ భవనాల్లో 625 భవనాలు పూర్తి చేశాం

-మరో 211 భవనాలు పూర్తి చేసే దశలో ఉన్నాయి
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గ్రామ స్థాయి లో ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించు కున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియచేశారు. శనివారం ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె యస్. జవహర్ రెడ్డి తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి, ఇతర సమన్వయ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ లతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ మాధవీలత, జిల్లా పంచాయతీ రాజ్ ఎస్ ఈ ఏ బివి ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 1100 ప్రాధాన్యత భవన నిర్మాణాలలో ఇప్పటికే 625 భవనాలు నిర్మాణం పూర్తి చేశామన్నారు. మిగిలిన లక్ష్యాలలో 211 భవనాల పనులు స్లాబ్ లు పూర్తి చేసి, చివరి దశలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన భవనాలు కూడా నవంబర్ నాటికి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏడు మండలాలకు చెందిన ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని భవన నిర్మాణ పనులకు చెందిన బిల్లులు వెబ్ సైట్ లో అప్లోడ్ చేసి ఉన్నందున, వాటికి చెందిన చెల్లింపులు ఒక్కటీ కూడా జరిగి ఉన్నందున పనులు చేపట్టిన ఏజెన్సీ లు తదుపరి పనులకు ముందుకు రాకపోవడం జరిగిందన్నారు. ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని భవన నిర్మాణ పనుల బిల్లులు విడివిడిగా అప్లోడ్ చేసేందుకు లాగిన్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ మాధవీలత కోరడం జరిగింది. ప్రతి రోజూ క్షేత్ర స్థాయి అధికారులతో భవన నిర్మాణ పనులపై సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యత భవనాలకు చెందిన రూ.7 కోట్ల మేర చెల్లింపులు పెండింగ్ లో ఉన్నట్లు తెలియచేశారు.

సమావేశంలో భాగంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచనలు చేస్తూ, రాబోయే నాలుగు నెలల్లో ప్రాధాన్యత భవనాలు ప్రారంభోత్సవానికి సంబంధించి షెడ్యూల్ రూపొందించాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన భవనాలు ప్రారంభోత్సవాలు ఎప్పటి కప్పుడు చేపట్టవలసి ఉందన్నారు. బిల్లులు చెల్లింపులు అప్లోడ్, ప్రారంభం కానీ భవనాలు, కోర్టు కేసులు పై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పి ఆర్ ఎస్ ఈ … ఏ బి వి ప్రసాద్, డ్వామా పిడి. జి. రామ్ గోపాల్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *