Breaking News

నాడు- నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎం.కె.బేగ్ హైస్కూల్లో రూ. 2.27 కోట్ల నిధులతో అదనపు తరగతుల నిర్మాణానికి భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనబడి, నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలు మహర్ధశను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాల నందు రూ. 2.27 కోట్ల నిధులతో 20 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఎండి.రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ షాహినా సుల్తానాలతో కలిసి గురువారం ఆయన భూమిపూజ నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో చదువుల విప్లవం వచ్చిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితులలో ఉండేవని.. కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయని వెల్లడించారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లీష్‌ ల్యాబ్స్, ప్రహరీ గోడలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయన్నారు. తొలుత 9 రకాల సదుపాయాల కల్పనకే ప్రణాళికలు రూపొందించినా.. తదుపరి కిచెన్‌ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ తరగతులు, ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ కూడా జోడించడం జరిగిందన్నారు.

వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగానికి రూ. 53 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నాడు–నేడు కింద తొలిదశలో 15,715 స్కూళ్లలో రూ.3,697.88 కోట్లతో వివిధ సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలనూ నాడు–నేడులో చేర్చినట్లు వెల్లడించారు. తొలివిడతతో కలిపి మొత్తం 61,661 విద్యాసంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు వివరించారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మూడేళ్లలో విద్యారంగానికి రూ. 200 కోట్లకు పైగా నిధులు వెచ్చించినట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. 28 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 33.49 కోట్ల నిధులతో 168 అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.వేల కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరిగాయన్నారు. ఎం.కె.బేగ్ సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నేడు అడ్మిషన్ల కోసం రికమండేషన్లు పెరిగాయంటే.. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మరోవైపు ఎం.కె.బేగ్ హైస్కూల్ కు అదనంగా మహిళా జూనియన్ కళాశాల మంజూరైందని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యవేక్షణలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నాడు-నేడు పథకం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.వెంకటేశ్వరరావు, నాయకులు ఎండి హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నందెపు సురేష్, చింతా శ్రీను, షేక్ అమిత్, కె.రాజు, పాండు, అజీజ్, షేక్ నాగుల్ మీరా, గల్లెపోగు రాజు, పేరంట్స్ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్, పాఠశాల సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *