విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్లోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తిని సింగ్ నగర్ వడ్డెర నాయకులు తమ్మిశెట్టి కాళికా ప్రసాద్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వడ్డెర నాయకులతో వడ్డెర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా వడ్డెర్ల పై జరుగుతున్న అత్యాచారాలు దాడులుపై చర్చించారు. అదేవిధంగా గుంటూరు మద్దిరాల కాలనీకి నాలుగు సంవత్సరాల వడ్డెర పసిపాపపై అగ్రకులాలకి చెందిన సుబ్బారావు అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చిన్నారి తండ్రితో తమ్మిశెట్టి చక్రవర్తి ఫోనులో మాట్లాడి భాదితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంనుంచి కానీ, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కానీ ఇప్పటి వరకూ భాదితులని పరామర్శించకపోవడం దారుణమని వడ్డెర్లపై అత్యాచారాలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వానికి తీరికలేదని వడ్డెర లంటే ప్రాణమని చెప్పిన జగన్ వడ్డెర బిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీసం స్పందించలేదు. ఇప్పటికైనా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని బాధితురాలికి 25 లక్షల నష్టపరిహారం అందించాలని అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితునికి మరణ శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర నాయకులు దేరంగుల బాబురావు, దేవల్ల శ్రీనుబాబు, దేరంగుల పున్నారావు, బండారు గణేష్, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News