విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణీకుల/వినియోగదారుల మన్ననలు పొందుతూ 2022-23 సంవత్సరంలో ప్రగతి పధంలో దూసుకుపోతోంది. 2022-23 సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు 72% ఓ.ఆర్. నమోదు అయ్యింది. (గత సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగష్టు వరకు 60% మాత్రమే ఉంది)
ట్రాఫిక్కేతర ఆదాయంలో భాగంగా ఆర్టీసీ కార్గోలో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పార్శిళ్ళు అందించేందుకు ఇంటింటికీ డోర్ డెలివరీ సదుపాయం ప్రవేశపెట్టబడింది. నిత్యం సేవలందిస్తూ రోజురోజుకు ఆదాయం గణనీయంగా పెంచుకుంటోంది. 2021-22 సంవత్సరంలో కార్గో ద్వారా రూ.122 కోట్ల ఆదాయం సంపాదించడం జరిగింది. 2022-23 సంవత్సరంలో అధిక ఆదాయం సంపాదించుటకు జూలై 25 నుండి ఆగష్టు 24 వరకు కార్గో ప్రచార మాసోత్సవాలు నిర్వహించగా రోజుకు సగటున 5802 పార్శిళ్ళతో 1,79,869 డోర్ డెలివరీలు బుకింగ్ చేయబడ్డాయి. గతంలో నెలకు 972 డోర్ డెలివరీ పార్శిళ్ళు బుక్ అయ్యేవి. దీనికి సహకరించిన వినియోగదారులకు, సంస్థ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.
అదే విధంగా బస్సుల నిర్వహణలో ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త బస్సులను ప్రవేశపెట్టే యోచనలో భాగంగా 998 అద్దె బస్సులకు టెండర్లను కూడా ఆహ్వానించింది. 2022 జూన్ నెలలో MSTC 6 ద్వారా పిలిచిన టెండర్లలో 339 అద్దె బస్సులు కొత్తగా ప్రవేశపెట్టబడుచున్నవి. అదే విధంగా ఆగష్టు నెలలో పిలిచిన టెండర్ల ద్వారా ఇప్పటివరకు మరో 156 బస్సులు ఖరారైనవి. ఇంకా ఈ వారంలో 200 బస్సులు ఖరారు కావొచ్చని అంచనా. ఈ డిశంబర్ లోపు మొత్తం 1000 కొత్త అద్దె బస్సులు తీసుకొనేలా ప్రణాళికలురూపొందించబడినవి.
ఇటీవల కాలంలో కదులుతున్న బస్సుల లోంచి ఎక్కేటప్పుడు గాని/ దిగేటప్పుడు గాని కొందరు ప్రయాణికులు ఆక్సిడెంట్లకు గురవుతున్నట్టు గమనించడం జరిగింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రమాదాలు నివారించేందుకు ప్రతి బస్సులో న్యుమాటిక్ కంట్రోల్ డోర్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న పాత బస్సులన్నింటికీ రెట్రో-ఫిట్ న్యూమాటిక్ డోర్లను దశలవారీగా ఏర్పాటు చేస్తాము. పల్లె వెలుగు బస్సులకు ఒక్కొక్కటి రూ.15,000/- మరియు ఇతర బస్సులకు ఒక్కొక్కటి రూ. 10,000/- మొత్తం కలిపి దాదాపు రూ. 10 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
గత సంవత్సరము రూ.15 కోట్ల వ్యయంతో 1285 పల్లె వెలుగు బస్సులను నవీకరించడం జరిగింది. కాగా, ఈ సంవత్సరము రూ. 25 కోట్ల వ్యయంతో ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు మొత్తం 1100 బస్సులను నవీకరించడం జరుగుతున్నది.
కొత్తగా 62 నాన్ ఏ/సి స్లీపర్ బస్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ బస్సుల బ్రాండ్ కు పేరు పెట్టేందుకు General public మరియు ఆర్టీసీ సిబ్బంది నుండి సలహాలు కోరగా రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం 3585 బ్రాండ్ పేర్లు వచ్చినవి. ఈ బస్సులకు అందులో నుండి ఉత్తమమైన బ్రాండ్ పేరు “ స్టార్ లైనర్” (“STAR LINER”- Sleep Travel And Relax)) సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ పేరు ప్రదిపాదించిన వారికి త్వరలో క్యాష్ ప్రైజ్ అందించడం జరుగుతుంది.
దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు :
గత సంవత్సరం అక్టోబరు 15న జరుపుకున్న దసరా పండుగకు పురస్కరించుకుని ఆర్.టి.సి 2340 ప్రత్యేక బస్సులను నడిపింది.
ఈ సంవత్సరం అక్టోబరు 5 దసరా పండుగను పురస్కరించుకుని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి 4000 ప్రత్యేక బస్సులను నడుపుటకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దసరా పండుగ సందర్భంగా నడిపే ఈ ప్రత్యేక బస్సులన్నీ సాధారణ ఛార్జీలతోనే నడపబడును.
త్వరలో చేపట్టనున్న/ ప్రోగ్రెస్ లో ఉన్న కార్యక్రమాలు :
1. OS 15 :
ఖాళీ స్థలాలను 15 ఏళ్ళ పాటు లీజుకు తీసుకునేందుకు సంస్థ కొత్త పధకాన్ని ప్రారంభించే యోచన
మండల స్థాయిలో టెండర్లకు ఆహ్వానం
2. BOT :
BOT పథకం కింద ఆటోనగర్ మరియు కర్నూలు రాజ్ విహార్ బస్ స్టేషన్ల అభివృద్ధికి సంస్థ టెండర్లను ఆహ్వానిస్తోంది.
తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ను ఇంటర్ మోడల్ బస్ స్టేషన్ గా అభివృద్ధి చేయడం కొరకు NHLML ( నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్) తో అవగాహన ఒప్పందం జరిగింది. నిర్మాణం కోసం స్థల పరిశీలన కూడా చేశారు.
ఇటీవల BOT పథకం కింద టెండర్లను ఆహ్వానించగా 2 చోట్ల (నరసరావుపేట & ఏలూరు) ఔత్సాహక వ్యాపారవేత్తలు ముందుకొచ్చారు. త్వరలో ఖరారు కాబోతున్నాయి.
3. 102 చోట్ల లీజుకు BSNL రూఫ్ టాప్ పోల్స్ ఏర్పాటుకు ప్రణాళిక
4. రూ. 100 కోట్లతో పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, గుడివాడ, హనుమాన్ జంక్షన్, నర్సాపురం, ఆత్మకూరు (కె), డోన్, బేతంచెర్ల. ప్యాపిలి, సింగరాయకొండ బస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాము. రాజాం బస్ స్టేషన్ మరియు తగరపువలస బస్ డిపో నిర్మాణం కొరకు చర్యలు తీసుకుంటున్నాము.
5. విజయవాడ PNBS, విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్.రాజమండ్రి, గుంటూరు,నెల్లూరు & తిరుపతి లలో వారం రోజుల్లో 24X7కార్గో బుకింగ్ సౌకర్యం ప్రవేశ పెట్టబడుతోంది. APSRTC ద్వారా అనుసంధానించబడిన అన్ని గ్రామాలలో లాజిస్టిక్స్ కార్యకలాపాలను విస్తరించడానికి సెప్టెంబర్ 2022 నెలలో సిబ్బంది సర్వీసు(connecter TIM’s) ద్వారా కొరియర్ బుకింగ్ ను ప్రవేశ పెట్టాలని యోచన.
6. UTS ( యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్) :
దేశంలోనే ప్రప్రధమంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నది. ప్రస్తుతం ఉన్న OPRS, కార్గో బుకింగ్, వెహికల్ ట్రాకింగ్ మరియు బస్ పాస్ జారీ చేయు విధానం లాంటి అంశాలన్నీ కూడా ఒకే యాప్ (AAP)/ SYSTEM లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న TIM మెషీన్లకు బదులు e- pos మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మరియు UPI (ఫోన్ పే /గూగుల్ పే etc.) విధానం ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం కల్పిస్తోంది. ప్రతి బస్సు యొక్క ఖచ్చితమైన లొకేషన్ ను ఈ యాప్ (UTS) ద్వారా తెలుసుకోవచ్చు. బస్సు బయలు దేరిన తర్వాత కూడా గమ్య స్థానం లోపు మధ్య బస్ స్టేషన్లలో ఎక్కడైనా టికెట్ రిజర్వ్ చేసుకొనవచ్చు.
ఇప్పటికే విజయవాడ, గుంటూరు–I డిపోలలో ఈ UTS విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా (ప్రయోగాత్మకంగా) అమలు జరిపి విజయవంతంగా కొనసాగించబడుతున్నది. ఈ సంవత్సరం చివరకు మొత్తం 129 డిపోలలో ఈ UTS విధానాన్ని విస్తరించడానికి చర్యలుచేపట్టడం జరిగింది.
7. ఎలక్ట్రిక్ బస్సులు :
GCC మోడల్ పై 9 మీటర్ల పొడవు గల 100 ఎ/సి విద్యుత్ బస్సులను సరఫరా చేయడానికి సంస్థ ఆర్డర్ చేసింది. ఈ బస్సులు తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డు మరియు తిరుపతి- నెల్లూరు, మదనపల్లి మరియు కడప ఇంటర్ సిటీ రూట్లలో
నడపబడతాయి.
8. జనతా గ్యారేజ్ పధకం :
GOAP ఆదేశాల మేరకు APSRTC డిపో గ్యారేజీలు మరియు జోనల్ వర్క్ షాప్, టైర్ రీట్రేడింగ్ ల ద్వారా ఇప్పటికే ఉన్న ప్లాంట్ & మెషినరీ యొక్క స్పేర్ కెపాసిటి మరియు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్ని ఉపయోగించుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో జనతా గ్యారేజ్ పథకాన్ని అమలు చేయబడుతోంది. ప్రైవేటు బస్సులు మరియు ట్రక్కుల టైర్లను రీక్యాపింగ్ చేయడం, ఇంజన్లు, గేర్ బాక్స్ లు మరియు ఇతర ప్రధాన యూనిట్ల మరమత్తు బస్ బాడీ/ ట్రక్ బాడీ మరమత్తులు తదితర నాణ్యమైన సేవలు మరియు ఉత్పత్తులు అత్యంత తక్కువ ధరలకు అందించబడును.
Prajavartha Online Telugu News