Breaking News

ప్రాధాన్యత క్రమంలో 50 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్ల లోని అన్నీ అంతర్గత రహదారులతో పాటు ,డ్రైనేజీ నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అభివృద్ధి చేయడం జరుగుతుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. సోమవారం  ఆయన స్థానిక మచిలీపట్నం 13 వ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారం నుంచి షేక్ ఇమామ్ వీధిలో 15 వ ఆర్ధిక సంఘ నిధులతో రూ 8.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన డ్రైనేజీ కు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన జనరంజకంగా సాగిస్తున్నారని ,గడచిన మూడు సంవత్సరాలుగా మచిలీపట్నం కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున నిధులు మంజూరు చేశారని తెలిపారు ,అన్ని డివిజన్ల లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ , డిప్యూటీ మేయర్ తంటి పూడి కవితా థామస్ నోబుల్ , మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), 13 వ డివిజన్ కార్పొరేటర్ గాజుల శ్రీదేవి, ఇంఛార్జి గాజుల భగవాన్, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, 11 వ డివిజన్ ఇంచార్జ్ గూడవల్లి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్ లు, ఇంఛార్జి లు , కో – ఆప్షన్ సభ్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *