Breaking News

నగరంలో ‘‘శివయ్య మెస్‌ & క్యాటరర్స్‌’’ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘శివయ్య మెస్‌ & క్యాటరర్స్‌’’ను నగరంలో విశాలంగా, అన్ని సౌకర్యాలతో ప్రారంభించడం అభినందననీయమని సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం విశాలాంధ్రరోడ్డులోని, మెట్రో మాల్‌ ఎదురుగా ‘‘శివయ్య మెస్‌ & క్యాటరర్స్‌’’ను సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఆంధ్ర భోజనంతోపాటు వెజ్‌ & నాన్‌వెజ్‌ భోజనం చేయాలంటే ‘‘శివయ్య మెస్‌ & క్యాటరర్స్‌’’ తరువాతేనని కొనియాడారు. పలు రుచులతో నాణ్యమైన ఆహారం అందించడంలో అంచెలంచెలుగా దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శివయ్య మెస్‌ & క్యాటరర్స్‌’’ నిర్వాహకులు దోనేపూడి రాము మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సంపూర్ణ భోజనం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈమెస్‌ను ప్రారంభించారని, ఆంధ్ర రుచులతో వెజ్‌ & నాన్‌వెజ్‌ విభిన్న రకాల వంటకాలు అందిస్తున్నట్లు వివరించారు. దానితోపాటు అరటాకు భోజనం మా ప్రత్యేకతని తెలిపారు. సాయంకాలంనందు చైనీస్‌ వంటకాలు నూడిల్స్‌, మంచూరియా, వెజ్‌బిర్యానీ తదితర ప్రత్యేక వంటకాలు అందిస్తున్నామన్నారు. తమ మెస్‌కి వస్తే అత్తారింటికి వచ్చినట్లేనని కడుపు నిండేవరకు కొసరి..కొసరి వడ్డిస్తామని ఎక్కడ రాజీపడేది లేదన్నారు. భోజనంలో అనేక రకాల పచ్చళ్ళు, పొడులు, నెయ్యి వడ్డిస్తామన్నారు. శాఖాహార, మాంసాహార భోజనప్రియులకు ఒక్కసారి తమ మెస్‌కు విచ్చేస్తే అసలైన సిసలైన భోజనం ఎలా ఉంటుందో రుచిచూపిస్తామని తెలిపారు. కస్టమర్ల ఆదరాభిమానాలతో భవిష్యత్‌లో మెస్‌ని మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సిద్ధార్థ కాలేజీ పూర్వ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌, లయన్స్‌క్లబ్‌ మెంబర్‌ పువ్వాడ నరేష్‌, నగర ప్రముఖులు, మెస్‌ కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *