విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక గుర్తింపు కలిగి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాల సైతం లెక్కచేయక విధులు నిర్వహిస్తుంటారని అటువంటి ఉద్యోగుల సమస్యలు అనేకం అపరిష్కృతంగా, ఆరోగ్య శాఖలో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని, కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులేజేషన్, అలాగే యూరోపియన్ ఏఎన్.యం,2వ ఎయన్ యంలకు భరోసా కల్పించాలని ముఖ్యంగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంల బయోమెట్రిక్ ను రద్దు చేయాలని, అలాగే సి డి యన్ సిడి సర్వే,అలాగే అనేక యాప్ ల ద్వారా ఉద్యోగులు సతమతమవుతున్నారని వాటిని తగ్గించాలని, అలాగే పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అనేక క్యాడర్ల కు పదోన్నతులు కల్పించాలని, జీవో 143 సవరించాలని, ఫీల్డ్ లో పనిచేస్తున్న వారికి ఎఫ్ టి ఏ మంజూరు చేయాలని, అలాగే రెగ్యులర్ ఎయన్ యంలను మ్యాపింగ్ ద్వారా సచివాలయాలకు కేటాయించే విధానంలో రెగ్యులర్ ఉద్యోగుల కు వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నాయకుల బృందం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ మచ్చా నాగరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.శ్రీనివాసులు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.చంద్రశేఖర్, అంతపురం జిల్లా కన్వీనర్ విజయ్ కుమార్, ఆర్. ప్రభావతి,వెంకటేశ్వరరావు, సమ్మయ్య, నేడు గొల్లపూడి లోని కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు రామిరెడ్డి ని కలసి వినతిపత్రం సమర్పించడం తదనంతరం హెల్త్ డైరెక్టర్ వి రామిరెడ్డి ని సన్మానించడం జరిగింది.
Prajavartha Online Telugu News