-పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో చేపట్టిన పోషణమహా కార్యక్రమాన్ని విజయవంతం చేసి పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు. స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించనున్న పోషణమహా కార్యక్రామానికి సంబంధించి గోడపత్రికను మంగళవారం ఆయన కార్యాలయంలో కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 1వ తేది నుండి 30వ తేది వరకు నెల రోజులపాటు జిల్లాలో జిల్లాస్థాయి అంగన్వాడీ ప్రాజెక్టు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, సచివాలయ స్థాయిలలో పోషణ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు రక్తహీణత, పరిశుభ్రత, సంపూర్ణ పోషణ, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. పోషణమహా కార్యక్రమంలో భాగంగా 1వ తేది నుండి 5వ తేది వరకు ర్యాలీలు, 2కె రన్, పోషణపై అవగాహన, పౌష్టిక ఆహార కిట్ల పంపిణీ, పోషణ అబియాన్ రిజిస్ట్రేషన్లను నిర్వహించడం జరిగిందన్నారు. 6న తేదిన ఎర్లీ చైల్డ్ కేర్ పై అవగాహన, 7న కమ్యూనిటీ ఈవెంట్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, 8న తేదిన కిచెన్ గార్డెన్‌పై అవగాహన, 9న గర్భవతులు బాలింతలకు రక్తిహీణతపై ఆరోగ్య పరీక్షలు, 10న ఆశా వర్క్‌లు ఐసిడిఎస్ వైద్యశాఖ అధికారులు ఇంటింటి సందర్శన కార్యక్రమాలు, 12న రుతు సమయంలో పరిశుభ్రతపై కిశోరబాలికలకు అవగాహన, 13న హ్యండ్‌వాష్, నీటివలన కలిగే వ్యాధులపై అవగాహన, 14న హెల్త్ క్యాంప్ నిర్వహణ, 15న సచివాలయలలో అవగాహన సదస్సుల నిర్వహణ, 16న తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన, 17న స్వచ్ఛతపై క్విజ్, డ్రాయింగ్ పోటీల నిర్వహణ, 19న మురికివాడలలోని అంగన్వాడీ సేవలపై అవగాహన, 20న రక్తహీనత, రోగనిరోద టీకాలపై అవగాహన, 21న కుటుంబంలోని పురుషులకు పౌష్టికాహారం పరిశుభ్రతపై అవగాహన, 22న ఆయుష్ డిపార్టమెంట్ ద్వారా పంచాయతీలలో అవగాహన కార్యక్రమాలు, 23న ఆయుష్ డిపార్టమెంట్ ఆధ్వర్యంలో యోగ తరగతులు నిర్వహణ, 24న చిరుదాన్యాలతో పౌష్టికాహారం తయారీపై పోటీలు, 26న వైద్య, ఆరోగ్య, ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో రక్తహీనతను గుర్తించేందుకు గృహాల సందర్శన, 27న వెల్బేబి షో నిర్వహణ, 28న పౌష్టికాహారంపై చర్చావేదికల నిర్వహణ, 30వ తేదిన ముగింపు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. పోషణమహా కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, మెప్మా, సెర్ప్, ముడా, గిరిజన సంక్షేమం, ఆయుష్, విద్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు తప్పక పాల్గొని ప్రజలకు పోషణ పౌష్టికాహారం పై అవగాహన కల్పించేలా కృషి చేయాలన్నారు. గోడపత్రిక విడుదల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్‌కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి. ఉమాదేవి, సిడిపివోలు జి.మంగమ్మ, టి.నాగమణి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News