విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిలను సంరక్షించండి వారిని విద్యావంతులను చేయండి) అనే నినాదముతో మన విజయవాడ నగరములో సుకన్య మహోత్సవము నిర్వహిస్తున్న సంధర్బముగా పోస్టల్ సిబ్బంది ‘‘ప్రభాత భేరి’’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయవాడ పొస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్, హెడ్‌పోస్టాఫీస్ కార్యాలయంనందు జరిగిన విలేకరుల సమావేశంలో మల్లాది హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని ప్రతి ఆడ పిల్లకు వర్తించేలా అందరూ పోస్టాఫీసు ద్వారా సుకన్య సమృద్ధి ఖాతాను తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. 0-10 సంవత్సరముల లోపు వయస్సుగల బాలికలకు తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవచ్చన్నారు. ఖాతా యొక్క కాలపరమితి 21 సంవత్సరాలని, ఖాతా తెరచిన తేదీ నుండి పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే పొదుపు చెల్లించవలసి వుంటుందన్నారు. 21 సంవత్సరాల తరువాత వడ్డీతో కలిపి పూర్తి సొమ్ము పొందవచ్చన్నారు. వడ్డీ శాతం కూడా అధికంగా వుంటుందని, పన్ను రాయితీలకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. 250 రూపాయలతో ఖాతాను తెరవచ్చన్నారు. ఈనెల 23 తేదీన సాయంత్రం 4 గంటల నుండి 6గంటల వరకు తమ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపైన్ ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.రవికిషార్, ఆఫీస్ అసిస్టెంట్స్ ఝాన్సీ, హారిక తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News