Breaking News

ముహమ్మద్ ఫతావుల్లాహ్ కు కేశినేని శివనాథ్ చిన్ని మరియు పట్టాభి పరామర్శ

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
గుండె జబ్బుతో గత 10 రోజుల నుంచి బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఫతావుల్లాహ్ ను వించిపెట్ లో గల ఆయన స్వగృహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని, మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పరామర్శించారు. విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం కుదుటపడేలాగా చూసుకోవాలనీ అలాగే త్వరలో గుండెకు జరిగే శస్త్ర చికిత్స విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు, కోటీశ్వరులు కూడా చేయలేని సేవా కార్యక్రమాలు మీరు చేశారని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసే అవకాశం అల్లాహ్ మీకు పూర్తిగా ఇస్తాడని అలాగే అల్లాహ్ సహకరిస్తారని త్వరలో మరల ప్రజా జీవితంలో రావాలని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడాలని కేశినేని శివనాద్ చిన్ని ఆకాంక్షించారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మొహమ్మద్ ఫతావుల్లా లాంటి నిబద్ధత కలిగిన నాయకుల సేవలు చాలా అవసరమని , రాబోయే కాలంలో మొహమ్మద్ ఫతావుల్లా ముఖ్య భూమిక పోషిస్తారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అబ్ధుల్ ఖలీఖ్, తూర్పు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుఅబ్ధుల్ కరీం, రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షులు షేక్ ఆషా, దళిత సీనియర్ నాయకులు కామా దేవరాజ్, పార్లమెంట్ కార్యదర్శి కొట్టెటి హనుమంత రావు, పరుచూరి ప్రసాద్, పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ తమీం అన్సార్, పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి జాహేద్ , మహిళా నాయకురాలు మొవ్వ విజయ , సరోజినీ తదితర నాయకులూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *